ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆయనకు గుండెపోటు వచ్చిందని ప్రచారం జరుగుతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తన రాబోయే మూవీ పన్నియిన్ సెల్వన్ మూవీ ట్రైలర్ లాంచ్ లో పాల్గొనాల్సి ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు విక్రమ్