విజయదశమి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున చేసుకుంటా ము. ఈ పండుగ ఇచ్చే సందేశం ఏమిటి? ఈ పండుగ మనకు రెండు విషయాలను ఎప్పుడు ప్రభోదిస్తూవుంటుంది 1) విజిగీషీ ప్రవృత్తి 2)సంఘటిత శక్తి .
విజిగీషీ ప్రవృత్తి
విజిగీషీ ప్రవృత్తే మన మన:ప్రవృత్తిగా ఉండాలి, అలా ఉంటే మన జీవితం సాఫల్యం చెందుతుంది.విజిగీషీ ప్రవృత్తి అంటేఎప్పుడూ విజయం సాధించాలి అనే ప్రవృత్తి, కష్ట సమయంలో కుంగిపోకుండా ఉండాలంటే సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది , నిర్ణయం ముందుగా ఆలోచించి తీసుకోవచ్చు లేక అప్పటికప్పుడే తీసుకోవచ్చు , అంటే ఇప్పటి భాషలో క్రైసిస్ మేనేజిమెంట్. దీనికి సంబంధించిన రెండు ఉదాహరణలు చూద్దాం 1) మహాభారతంలో కర్ణుడి సంహారం కంటే ముందు కర్ణుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో ధర్మరాజు చేతులు ఎత్తేస్తాడు, కర్ణుడు వదిలేస్తాడు, ఆ అవమానం భరించలేక ధర్మరాజు తన శిబిరానికి వెళ్ళిపోతాడు, దానిని గమనించిన శ్రీ కృష్ణుడుధర్మరాజును ఓదార్చేందుకు అర్జునిడితో ధర్మరాజు శిబిరానికి వెళ్తాడు ధర్మరాజు వాళ్లకు ఎదురువచ్చి అర్జునిడితో ఈ రోజు మనవిజయానికి కీలక మలుపు త్రిప్పినరోజు అని అంటాడు, ఎందుకంటే అర్జునుడు కర్ణుడిని చంపి వచ్చాడని భావించి అంటాడు, దానికి అర్జునుడు తల నేలకి వేస్తాడు దానితో ధర్మరాజు కోపంతో అర్జునుడిని మందలిస్తాడు, నీకు చేతకాకపోతే నీ గాండీవం ఎవరికైనా ఇయ్యి అంటాడు, గాండీవాన్ని ప్రస్తావించటంతో ఆగ్రహించిన అర్జునుడు ఒరలోనుంచి ఖడ్గాన్ని బయటకు తీసి ధర్మరాజు తల నరకపోతాడు అడ్డుకొన్న కృష్ణుడి తో తన ప్రతిజ్ఞానెరవేరాల్సిందే అని అంటే కృష్ణుపెద్దవాళ్ళను అవమానిస్తే చంపినట్లే అవమానించామని అంటాడు అర్జునుడు ధర్మరాజును అవమానిస్తాడు , ఆ తదుపరి అర్జునుడు మల్లి వరనుంచి కత్తి తీసి తన తల నరుక్కుపోతాడు,మళ్ళి ఏమిటని కృష్ణుడు అడిగితే ధర్మరాజును అవమానించినవాని తలనరుకుతానని ప్రతిజ్ఞా చేసానని అంటాడు, అప్పుడు కృష్ణుడు నిన్ను నీవుపొగుడుకో ఆత్మహత్య చేసుకొన్నట్లే , అని చెప్పి భగవాన్ శ్రీ కృష్ణుడు సమయస్ఫూర్తితో ధర్మరాజుని అర్జునుని కాపాడటం. 2 రామ రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు రాముడిని లక్ష్మణుణ్ణి నాగపాశము తో బంధించినప్పుడు విభీషణుడు సుగ్రీవుడు మొదలైన ప్రముఖులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అదేదీ పట్టించుకోకుండా హనుమంతుడు వెంటనే గరుత్మంతుడి దగ్గరకు చేరటం అదే సమయంలో నారదుడు కూడా అక్కడికి చేరటం ఇద్దరూ గరుత్మంతుని ప్రార్థించి రామలక్ష్మణులను నాగ పాశం నుండి విముక్తి కలిగించటం చేస్తాడు , ఒకవేళ హనుమంతుడు ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకునే ఉండకపోతే యుద్ధరంగం పరిస్థితి మరో రకంగా ఉండేది ఇట్లా చరిత్రలో మన జీవితాలలో అటువంటి సందర్భాల్లో వస్తుంటాయి అప్పుడు మనం ఎట్లా ఉంటాము అనేది మౌలికమైన అంశం అందుకేవిజిగీషీ ప్రవృత్తి ఉండాలి అ విజిగీ షి ప్రవృత్తే విజయదశమి సందేశం.
శక్తి ఉపాసనా చేయాలి
ప్రపంచం ఎవరు ముందు తలవంచుతుంది, ఎవరి మాట వింటుంది, ఎవరిని అనుసరిస్తుంది, అంటే శక్తి ముందే అని యుగయుగాలుగా మనకు బోధిస్తున్న సత్యం. ఆ శక్తి సాత్విక శక్తి అయినప్పుడు జగత్ కళ్యాణం, ఆ శక్తి అసుర శక్తి అయినప్పుడు జగత్ వినాశనం, అందుకే ధర్మ సంరక్షణ కోసం నిరంతర సంఘర్షణ సాత్విక శక్తి,అసుర శక్తుల మధ్య జరుగుతూనే ఉంటుంది. ధర్మ సంరక్షణకు ఎప్పుడు సాత్విక శక్తి బలంగా ఉండాలి. శక్తి రెండు రకాలు 1) క్షాత్ర శక్తిత్ర 2) బ్రహ్మ శక్తి.
అగ్రతః చతురోవేదాన్
పృష్ఠతః స శరం ధను: :
ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం
శాపాదపి శారదాపి
అంటే శపించేందుకైనా, శరంసంధించేందుకైనా మేము సిద్ధం . అందుకే శక్తి ఉపాసన మన లక్ష్యం, అదే విజయదశమి పండుగ మనకు ఇచ్చే సందేశం. దుర్గామాత మహిషాసురుడు ఆది రాక్షస శక్తిని నాశనం చేసేందుకు దేవతలందరూ తమ శక్తులను దుర్గామాతకు ఇచ్చారు, దుర్గామాత ఒక సంఘటిత శక్తి గా అసుర శక్తులను సంహరించింది. భగవాన్ శ్రీ రామచంద్రుడు రావణాది రాక్షసులను సంహరించడానికి ఈ భూ ప్రపంచం లో ఉన్న వానర శక్తి అంతటిని సంఘటితం చేసి భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణాసుర రాక్షసులను సంహరించడు ఆ విజయం విజయదశమి పండుగ రోజున జరిగింది. అట్లాగే మహాభారత కాలంలో అర్జునుడు ఉత్తర గ్రహణం సమయంలో ఒంటరిగా భీష్ముడు ద్రోణుడు దుర్యోధనుడు కృపాచార్యుడు మొదలైన కౌరవ యోధులను అందరిని ఓడించి ఆవులను తరలించుకుపోయారు, అది విజయదశమి రోజున జరిగింది, అందుకే ఈ విజయదశమి రోజున ఈ క్రింది శ్లో కాన్ని పఠిస్తాము
శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశని
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శిని
రాష్ట్రీయ స్వయంసేవక సంఘము విజయదశమి రోజే ప్రారంభం
అట్లాగే ఈ కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘము విజయదశమి పండుగ రోజున ప్రారంభమైనది. సంఘం హిందూసమాజసంఘటనచేస్తున్నది . సంఘం ఏ విధంగా పని చేస్తున్నదో సంక్షిప్తం గా తెలుసుకొందాం. సంఘం మూడు రకాల పనులు చేస్తున్నది. అందులో
1)నిరంతర సాధన, సాధన ఎక్కడ జరుగుతుంది? శాఖలో, సాధన అంటే ఏం చేస్తాం, వ్యక్తి నిర్మాణము అని చెప్తూ ఉంటాము , దానికి శారీరిక, మానసిక వికాసం తో పాటు ఈ శాఖకు వేర్వేరు ప్రదేశాల నుండి వేరు వేరు సామాజిక వ్యవస్థల నుండి వచ్చిన అందరిలో మనం అనే భావన నిర్మాణం చేస్తుంటాం . మనం అనే భావన మౌలికమైనది . మన దేశం వసుదైవ కుటుంబం అని చెప్పింది. అంటే ఒక కుటుంబంలోసభ్యులు అతి సహజంగా మనం అనే భావన తో కష్టసుఖాల్లో భావోద్వేగాలలో కలిసి ఉంటారు . దేశంలోని సంఘ శాఖ ద్వారా ఈరోజు హిందూ సమాజం లో మనం అనే భావన నిర్మాణం చేస్తున్నాం. ఈ భావనతోనే మన లక్ష్యం సాధించగలుగుతాం.
2 సంఘం దేశంలో ఒక గొప్ప వ్యవస్థను నిర్మాణం చేస్తున్నది. అందులో ఒకటి శాఖ2) సంఘం 3) సామాజిక రంగాలలో. వ్యవస్థ క్రింది నుండి పై వరకూ నిర్మాణం చేస్తూ తద్వారా ఒక సంఘటిత శక్తిని దేశానికి కార్యకర్తలకు అనుభవంలోకి తీసుకొని వస్తున్నది . సంఘం ఈ వ్యవస్థల నిర్మాణం మాత్రమే కాకుండా ఈ శక్తి ద్వారా సమాజానికి సంబంధించిన మంచి పనులను విజయవంతంగా చేయడం, దేశం యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయటం తద్వారా ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసం నిర్మాణం చేస్తున్నది. ఒకే సమయంలో సంఘంలో, వివిధ క్షేత్రాలలో పనులు చేసుకుంటూ పోతున్నారు , ఆ పనుల ద్వారా సమాజానికి విశ్వాసం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వాటిని సజీవం గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది . ఒకదాని తర్వాత ఒకటి కాకుండా అన్ని కలిపి చేస్తుంటాము . మన అనుభవంలో ఉండే విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం
. వేల సంవత్సరాల చరిత్ర లోని కొన్ని సందర్భాలను మాత్రమే యుగయుగాలుగా గుర్తు చేసుకుంటున్నాము, దానికి కారణం ఆ సందర్భాలలో స్పందించిన మహా పురుషులు వారు ఈ దేశానికి అందించిన నాయకత్వం. . భగవాన్ శ్రీ రాముడు , శ్రీకృష్ణుడు , చాణిక్యుడు , శాలివాహనుడు, విక్రమార్కుడు, శివాజీ ఇట్లా అలా మొదలైన వారి జీవితాలు విజిగీషీ ప్రవృత్తితో వారు సాధించిన విజయాలు, మనకు ప్రేరణ. ఈ కాలంలోని సమాజంలో పరిస్థితులు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, గడిచిన వెయ్యి సంవత్సరాలకు పైగా సాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకటానికి సంఘము ప్రారంభానికి ముందు నుండే అనేక ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి, సుమారుగా నూట నలభై ఆరు సంవత్సరాల నుండి ఒక అవిరళ ప్రయత్నం హిందూ సమాజంలో జరుగుతున్నది. ఆ పరంపరలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించింది. సంఘం తన బహుముఖ ప్రయత్నాల ద్వారా సమాజంలో వేగంగా దూసుకుపోతున్నది , శ్రేష్టమైన మన దేశం లక్ష్యాన్ని సాధించేందుకు విశేష ప్రయత్నం జరుగుతున్నది . ఈ సమయంలో మనందరం ఈ పని లో ఉండటం మన జీవితం ఎన్నో జన్మలలో చేసుకొన్నా అదృష్టం ఫలితం, అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటు ఎట్లా ముందుకు వెళ్తున్నాము మనం గమనించాలి, అధ్యయనం చేయాలి, దాని నుండి ప్రేరణ పొందుతూ మనం పనులు సమర్ధవంతం గా చేయాలి. సంఘముయొక్క విశిష్టత సంఘాన్ని పోలినట్లు వ్యవస్థ గతంలో ఎప్పుడూ ఈ దేశంలో నిర్మాణం కాలేదు, సంఘం హిందూ సమాజానికి సంబంధించిన అన్ని సామాజిక రంగాలలో ప్రవేశించి పనిచేస్తున్నది సంఘాన్ని పోలిన సంస్థ మరొకటి దేశంలో లేదు . ఈ సందర్భంగా రామాయణం లోని ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం
గగనం గగనాకారం
సాగరం సాగరోపహం
రామరావణ యోర్యుద్ధం
రామ రావణయోరివ
అంటే ఆకాశాన్ని దేనితోనూ పోలచలేము ఆకాశాన్ని ఆకాశం తోనే పోల్చాలి, సముద్రాన్ని కూడా దేనితో పోల్చలేము సముద్రం తోనే పోల్చాలి, రామ రావణ యుద్ధం రామ రావణ యుద్ధం తోనే పోల్చాలి. అట్లాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని సంఘం తోనే పోల్చాలి.
శక్తి వంతమైన నాయకత్వము లేకపోవటమే అతి పెద్ద సవాలు
ఈ సందర్భంగా దేశంలో ప్రపంచంలో తలెత్తుతున్న విపరిణామాలు, మంచి పరిణామాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం 1) దేశంలో దేశ వ్యతిరేక శక్తులు అంతిమ యుద్ధానికి తెర లేపుతున్నారు, వారి ఆయుధం ఈ హిందూ సమాజంలో ఉన్న వైవిధ్యం, ఈ సృష్టిలో ఎంత వైవిధ్యం ఉందో హిందూ సమాజంలో కూడా అంతే వైవిధ్యము ఉన్నది , ఆ వైవిధ్యం లో ఏకాత్మత మన బలం, వైరుధ్యాలు మన బలహీనత . వైరుధ్యమే జాతి వ్యతిరేక శక్తులు ఆయుధాలు, హిందూ సమాజంలో ఉండే వైవిధ్యాన్ని వైరుధ్యాలు గా మారుస్తూ ఈ దేశాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సంఘము వైవిధ్యంలో ఏకాత్మతను దర్శంపచేస్తూ , దేశాన్ని శక్తివంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది, ఈ రెండింటి మధ్య నిరంతర సంఘర్షణ సాగుతూ ఉన్నది, దానికి తాజా ఉదాహరణ ఈ మధ్య అమెరికా లోని 35 విశ్వవిద్యాలయాలు కలిసి ఏర్పాటు చేసిన ఒక వర్చువల్ సమావేశం ఆ సమావేశంలో దాని ఎజెండా హిందుత్వం, హిందూ మతము. హిందుత్వం అంటే ఒక ఫాసిజం , హిందూ మతం అంటే నిరంతరం అందరినీ కలుపుకొని ముందుకు పోయేది , ఈ విషయం పై చాలా చాలా తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి 2) దేశంలో శక్తివంతంగా నిలబడవలసిన శక్తులు బలహీనం కావటం మరో సమస్య. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ లో దేశంలో రెండు లేక మూడు శక్తివంతమైన పార్టీల వ్యవస్థ నిర్మాణం కావాలి, కానీ దేశంలోపార్టీ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, ఒకప్పుడు కాంగ్రెస్సే సర్వస్వంగా ఉండేది, ఇప్పుడు అది బలహీనమై ఉన్నది దానితో శక్తివంతమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. చిల్లర మల్లర రాజకీయ పక్షాలు పార్లమెంటులో గందరగోళం చేస్తున్నాయి .
ఈ దేశంలో ఈ దేశం మాది అని అనుకొని ఈ దేశానికి సంబంధించిన మౌలిక విషయాలను సమర్థించటం అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం ఈ దేశానికి సంబంధించిన ఐదు విషయాలలో దేశ ప్రజల అందరిలో ఏకాభిప్రాయం కావాలి 1 ) దేశం 2) జాతి 3) సంస్కృతి 4) ధర్మం5) జాతీయ మహాపురుషులు , దీనిలో ఈ దేశంలో ఇప్పటివరకు పూర్తి ఏకాభిప్రాయం రాలేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతోంది , ఏకాభిప్రాయ సాధన కోసం దేశంలో ఒక ప్రయత్నం జరుగుతున్నది దానికి వ్యతిరేక ప్రయత్నాలు కూడా అదే రకంగా జరుగుతున్నాయి. ఈ దిశలో ఏకాభిప్రాయ సాధనకు నిరంతర ప్రయత్నం జరిగి అందులో విజయం సాధించినప్పుడే ఆరోగ్యవంతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం అవుతుంది. దానిని నిర్మాణం చేయటానికి రాజకీయాలతో సంబంధం లేని సామాజిక వ్యవస్థ, ఆధ్యాత్మిక వ్యవస్థ ఈ దేశంలో శక్తివంతం కావాలి. సంఘం అదే పని చేస్తున్నది. ఈ సమయంలో మన సంఘం ముందున్న అత్యవసరమైన పని దేశంలోని మంచి శక్తులను సమన్వయ పరచడం, దేశంలోని సామాజిక, ఆధ్యాత్మిక శక్తులు సమన్వయంతో ఒక కార్యాచరణ రూపొందించుకుని పని చేయటం అనేది చాలా అవసరం. ఈ దిశలో సంఘము వేగవంతమైన ప్రయత్నాలూ చేస్తున్నది.
ప్రపంచంలో తలెత్తుతున్న సమస్యలు 1) అమెరికా కొన్ని దశాబ్దాలుగా ఏదో రూపంలో ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు, ప్రపంచ పోలీస్ గా వ్యవహరించేందుకు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అందరికంటే ముందు ఉండేందుకు ఎంతో ప్రయత్నం చేస్తూ వస్తున్నది, ప్రపంచానికి ఒక నాయకత్వం అందించాలనే తపన ఒకవైపు ఉంటే, మరోవైపు తన స్వార్ధంప్రయోజనాలను పూర్తి చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం కనపడుతున్నది. ప్రపంచంలో ఒకప్పుడు అమెరికా రష్యా రెండు పోటీ పడుతూ ఉండేవి రష్యా నాయకత్వం బలహీనమయి నామమాత్రంగా మిగిలిపోయింది, ప్రస్తుతం చైనా అమెరికా తో పోటీ పడుతున్నది, చైనా తన ఆధిపత్యం, ఆక్రమణ, ఆర్థిక శక్తుల పెంచుకోవటం కనపడుతున్నది, ఈ పరిణామం తో ప్రపంచంలో విపరిణామాలు సృష్టించేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి, మరో ప్రక్క ప్రపంచ ఆధిపత్యం కోసం ఇస్లాం సామ్రాజ్యం నిర్మాణం చేయడం కోసం ఇస్లాం తన ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా ప్రపంచాన్ని భయ కంపితం చేస్తున్నది , ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తుంది. దానికి తాజా ఉదాహరణ ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రయత్నం, వాటి తాజా పరిణామాలు , ఈ సమయంలో లో ఒక ప్రక్క రష్యా మరో ప్రక్క చైనా పాకిస్థాన్‌లు ఇంకొక ప్రక్క భారత్-అమెరికాలు తమతమ వ్యూహాలతో ఆఫ్ఘనిస్థాన్ లోని పరిణామాలను అధ్యయనం చేస్తూ ప్రపంచ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ కేంద్రం కాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నయి . ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించాలంటే విధ్వంసకర శక్తులను ఎదుర్కోగల శక్తివంతమైన నాయకత్వంకావాలి , ఆ దిశలో అంతిమ నాయకత్వం ఎప్పుడైనా భారత్ దే , అయితే భారత్ ఈరోజు ఆ స్థితిలో ఉన్నదా, ఆ స్థితికి చేరుకోగలదా అని ప్రపంచం ఎదురుచూస్తోంది భారత్ లో శక్తివంతమైన నాయకత్వం నిర్మాణం చేసుకుంటూ తద్వారా ప్రపంచానికి ఒక శ్రేష్ట నాయకత్వం అందించాలి, ఈ పనులు ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకే సమయంలో ఈ పనులన్నీ జరుగుతూ ఉండాలి . ఆ దిశలో మన దేశాన్ని సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది , ఆ పని విజయవంతం అయ్యేందుకు మనందరం కలిసి పని చేయాలి. ద్వాపరయుగంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఏ విధంగా పనిచేసి ధర్మాన్ని కాపాడాడో అదే పద్ధతిలో ఇవాళ సంఘం భారత్ ను శక్తివంతం చేసి ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించగలిగే నాయకత్వం ప్రపంచానికి అందించాలి . ఇది భగవంతుడు భారతదేశానికి ఇచ్చిన లక్ష్యం. సంఘం వేగవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, అదే విజయదశమి పండుగ మనకు బోధించేది. ఆదిశలో మనందరం కలసి పని చేయాలి.
రాంపల్లి మల్లికార్జున రావు