దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు విశేషాలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదే సమయంలో దేవాలయాన్ని ప్రతిరోజు వినూత్నంగా అలంకరిస్తున్నారు.
తొమ్మిది రోజులపాటు చేస్తున్న పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.
మహారాష్ట్ర, బెంగళూరు, కలకత్తా, ఊటీ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో అమ్మవారి ఆలయ సన్నిధిని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇందుకోసం ప్రతిరోజు రాత్రిపూట ఈ పుష్పాలంకరణ కు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
మంది సిబ్బందితో అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు.
ముందుగానే కంప్యూటర్ సహాయంతో వివిధ రకాల రంగులను డిజైన్ చేసుకుంటున్నారు. ఆయా రంగులు వచ్చేట్లుగా రకరకాల పువ్వులను పూలదండలను వినియోగిస్తూ అందాల ఇంద్ర ధనుస్సుని కనుల ముందు నిలుపుతున్నారు.
ఈ పుష్పాలంకరణ లో విశేషంగా చెప్పుకోవాల్సిన వివిధ రకాల వేరువేరు రాష్ట్రాలకు చెందిన పుష్పాలు. పింక్ గ్లాడు,
వైట్ గ్లాడ్, పర్పుల్ గ్లాడ్,
పుష్పాలతోపాటు పింక్ సోలో బాల్స్ వైట్ గ్లేడర్ బ్లూ డైస్ వైట్ డైస్ డిఫరెంట్ లీవ్స్ ఇతర ప్రత్యేకమైన పుష్పాలతో ఎంతో అందంగా చూస్తుంటే అలానే చూడాలనిపించే విధంగా తీర్చిదిద్దిన అలంకరణ అద్భుతంగా ఉందని భక్తులు అభినందిస్తున్నారు.
అమ్మవారి సన్నిధికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం తో ఆహ్లాదకరమైన అనుభూతి కల్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్రకీలాద్రి మీద రంగుల నందనవనం వెళ్లి విరుస్తోంది.