వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి తిరుగుతున్న కుమార్తెకు అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెప్పారు. పార్టీ ప్లీనరీ వేదిగ్గా ఈ విషయాన్ని స్పష్టం చేశారు విజయమ్మ. తమ కుటుంబం 45 ఏళ్లుగా ప్రజలకోసం పనిచేస్తోందని వైఎస్ ను, తరువాత తన కుమారుడు జగన్ ను, కుమార్తె షర్మిళను ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె అన్నారు. తన పిల్లలిద్దరూ పాదయాత్ర చేసినప్పుడూ ప్రజలు చూపించిన ప్రేమాదరాలు మరువలేనివన్నారు. తండ్రి ఆశయాలను కొడుకు కొనసాగించాడని…ఇప్పుడు అదే ఆశయంతో షర్మిల తెలంగాణలో దూసుకెళ్తోందని అన్నారు. కష్టకాలంలో తన కొడుకుకు అండగా ఉన్నానని ఇప్పుడు షర్మిళకు తన అవసరం ఉందని ఆమె చెప్పారు. కొడుక్కి న్యాయం చేసిన నేను ఈ సమయంలో నా బిడ్డ వెంట లేకపోవడం అంటే తనకు అన్యాయం చేసినట్టవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని విజయమ్మ అన్నారు. అందుకే వైసీపీనుంచి తప్పుకుంటున్నానని అందరూ మన్నించాలనీ ఆమె అన్నారు.