దీర్ఘకాలికంగా నిలిచిపోయిన విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని ఏ బి ఆర్ ఎస్ ఎం విన్నవించింది. అధ్యాపకుల సమస్యల మీద స్పందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అమరావతిలో నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ ను కలిసి అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘ్ నాయకులు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న దాదాపు 5000 అధ్యాపకుల ఖాళీలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని 2000 ఖాళీలను, ఇంటర్మీడియట్ కళాశాలలో ఉన్న 3500 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా 2015 నుండి కేవలం నెలకు పదివేల రూపాయలు జీతంతో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి లెక్చరర్ లకు కనీస జీతం 30 వేల గా నిర్ణయించాలని కోరుకొంటున్నారు . ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్సుడ్ స్కీం కింద ప్రమోషన్లు చేపట్టాలని విన్నవించారు . డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు .
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్న సమస్యలను వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహాసంగ్ (ఏ బిఆర్ ఎస్ ఎం ) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై వి రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎం బాలసుబ్రమణ్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శరత్ కుమార్ , ఇతర నాయకులు నారా లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.