రీల్ లైఫ్ లో విలనే అయినా రియల్ లైఫ్ లో హీరో అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు నటుడు సోనూసూద్. తాజాగా ఓవరాక్షన్ చేసి విమర్శల పాలయ్యారు సోనూ. ఇటీవల రైల్లో ప్రయాణిస్తున్న ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో సూద్ డోర్ దగ్గర ఫుట్ పాత్ మీద కూర్చుని ఉన్నారు. ప్రమాదకరంగా ఉన్న ఆ వీడియోను చూసి నెటిజన్లు మండిపడ్డారు. సమాజ సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడనుకుంటుంటే ఇవేచేష్టలంటూ మండిపడ్డారు. నార్తర్న రైల్వే సైతం ఘాటుగానే స్పందించింది. “ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మీకు అభిమానులున్నారు. మీరు ఎందరికో రోల్ మోడల్.రైలుడోర్ దగ్గర మెట్లమీద ప్రయాణం ప్రమాదకరం. ఇలాంటివి మీ అభిమానులకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి.ఇంకెప్పుడూ ఇలా చేయకండి” అని హెచ్చరించింది. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ సైతం గట్టిగానే స్పందిస్తూ మరెప్పుడూ ఇలాంటి స్టంట్లు చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
https://twitter.com/RailwayNorthern/status/1610625819986235393?s=20&t=IvadsLXrMlSyb5PzoKS0uQ