వచ్చేనెల గాంధీ నగర్లో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ కు రష్యా ప్రధాని మైఖేల్ మిషుస్టిన్ హాజరుకానున్నారు.
రష్యా ఫార్ ఈస్ట్-ఆర్కిటిక్ అభివృద్ధి మంత్రి అలెక్సీ చెకుంకోవ్ , ఫార్ ఈస్ట్ గవర్నర్లు పాల్గొంటారు. జనవరి 10 నుంచి 12 వరకు సదస్సు జరగనుంది. మొదటి రోజు రష్యన్ ఫెడరేషన్‌లోని ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ డిస్ట్రిక్ట్‌ల గవర్నర్లు,హెడ్లతో రౌండ్‌టేబుల్‌ని నిర్వహించనున్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత మెరుగుపరుస్తుందని… వాణిజ్య పెట్టుబడుల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లగలమని ఆశిస్తున్నామని… సమ్మిట్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
రష్యాఫార్ ఈస్ట్ ఖనిజ సంపద ఎక్కువ ఉన్నప్రాంతం.2019లో రెండో అతిపెద్ద సిటీ వ్లాదివోస్తక్ లో జరిగిన ఐదవ ఈస్టర్న్ ఎకనమిక్ సమ్మిట్ కు మోదీ హాజరయ్యారు. ఆప్రాంత అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్లను ప్రకటించారు. అదే ఏడాది వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ అత్యున్నత స్థాయి డెలిగేట్ మీటింగ్ కు హాజరయ్యారు. హర్యనా, గుజరాత్, యూపీ, గోవా సీఎంలు సహా 140 కంపెనీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
దాదాపు ఐదు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరుకానున్నారు. ఇటలీ భారీ పెట్టుబడి కంట్రీ…ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఇటలీ మోజాంబిక్, యూకే, జపాన్, స్వీడన్, నార్వే, సౌత్ కొరియా వంటి దేశాలతో ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయనున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో జరుగుతున్న సమావేశం కనుక అన్ని నిబంధనలు పాటిస్తున్నారు.వాక్సినేషన్ పూర్తైన వారికి మాత్రమే సమ్మిట్‌లోకి అనుమతి ఉంటుంది.