Press release
“ఇప్పుడు కాక ఇంకెప్పుడు” చిత్రం యూనిట్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనతో బెడ్ రూమ్ సన్నివేశాలు అసభ్యంగా చిత్రీకరించి, శ్రీ కృష్ణ పరమాత్మను మరియు తులసిమాతను కించపరిచేలా సన్నివేశాలు మరియు డైలాగులు పెట్టి హిందువుల విశ్వాసాలను గాయపరుస్తూ “ఇప్పుడు కాక ఇంకెప్పుడు ” చిత్ర ట్రయల్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసిన చిత్ర దర్శకుడు, నిర్మాత , నటీనటులు మరియు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని VHP రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ మరియు BJP మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ లు వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా రెండు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయడం జరిగింది.
ఈనెల 6వ తేదీన చిత్రం విడుదల అడ్డుకుంటామని VHP హెచ్చరిస్తుంది.
హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు ను ప్రక్షాళన చేయాలని VHP డిమాండ్ చేస్తుంది .
VHP రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, BJP మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్, VHP నేతలు పురుషోత్తమా చార్యులు, కల్వ బాలరాజ్, ఆకాశ్ వాగ్మే, మహేష్ మారుపాకుల , నాగేంద్ర, మందాటి భాను చందర్ లు వనస్థలీపురం సిఐ మురళీ మోహన్ గారిని కలిసి చిత్ర యూనిట్ పై క్రిమినల్ కంప్లైట్ ఇవ్వడం జరిగింది.