తెలంగాణ రాష్ట్రంలో గోరక్ష చట్టాన్ని కఠినాది కఠినంగా అమలు పర్చాలని తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిన కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలపై పిడుదులు గుద్ధి అసభ్యకరంగా ప్రవర్తించినా బంజారాహిల్స్ సిఐ సాయి పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బజరంగ్దళ్ కన్వీనర్ సుబష్ చందర్ డిమాండ్ చేశారు
గో రక్షణ కోసం ఉద్యమిస్తూ అరెస్టయిన బజరంగదళ్ రాష్ట్ర నాయకులు సుభాష్ చందర్ సహా యువకులను పరామర్శించేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారిని పోలీసులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన గోషామహల్ దగ్గర ధర్నాకు దిగారు. పోలీసులు తనకు క్షమాపణ చెప్పాలని… అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు..