
Veteran Major Madhan Kumar
పాకిస్తాన్ పై భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్ కి ఆధారాలు ఏవని ప్రశ్నించిన కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పలువురు ఆర్మీ అధికారులూ స్పందిస్తున్నారు. ఈసారి సర్జికల్ స్ట్రైక్ కు కేసీఆర్ రావడం కానీ, లేదా ఆయన కుటుంబ సభ్యులను కానీ పంపాలని వెటరన్ మేజర్ మదన్ కుమార్ ట్వీట్ చేశారు. సరిహద్దులో హిమాలయాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వచ్చి ఉంటే…మా ప్రాణాల్ని దేశం కోసం ఎలా పణంగా పెట్టేదీ తెలుస్తుందని మరికొందరు ఆర్మీవాళ్లు రీట్వీట్లతో విరుచుకుపడ్డారు.