ట్విట్టర్ ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేపడుతున్నారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్ అంటే బ్లూటిక్ తో అకౌంట్ కొనసాగాలంటూ నెలకు 8 డాలర్లు అంటే 661 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.అంటే ఏడాది దాదాపు 8 వేలు అన్నమాట. ఆ మొత్తం చెల్లించిన అకౌంట్లకు మాత్రమే బ్లూటిక్ కొనసాగుతుంది.స్పామ్, స్కామ్ నుంచి ట్విట్టర్ కు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మస్క్ అంటున్నారు.
Twitter’s current lords & peasants system for who has or doesn’t have a blue checkmark is bullshit.
Power to the people! Blue for $8/month.
— Elon Musk (@elonmusk) November 1, 2022
2009లో ఈ బ్లూటిక్ విధానం తీసుకువచ్చింది ట్విట్టర్. బ్లూ టిక్ పొందాలంటే గతంలో ఆన్ లైన్ అప్లికేషన్ నింపాల్సి ఉండేది. సెలబ్రిటీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు పెట్టుకున్న అప్లికేషన్లు మాత్రమే ఓకే చేసేవారు.
ఇక కొంత కాలంగా ట్విట్టర్ కు లాభాలు తగ్గాయి. దీంతో సిస్టమ్ ను గాడిన పెట్టే ప్రయత్నాలు వేగంగా ప్రారంభిస్తున్నారు మస్క్. అలాగే అడ్వర్టైజ్మెంట్ల మీద ఆధారపడడాన్నీ తగ్గించే ప్రయత్నం చేస్తామనీ స్పష్టం చేశారు. అదే సమయంలో మస్క్ నాయకత్వంలోని ట్విట్టర్ పట్ల కొన్ని కంపెనీలు విముఖంగా ఉన్నాయి. జనరల్ మోటార్స్ అయితే ట్విట్టర్ అడ్వర్టైజ్ మెంట్లను రద్దు చేసుకుంది కూడా. మరో అడ్వర్టయిజింగ్ కంపెనీల ఐపీజీ కొన్నాళ్లపాటు యాడ్స్ నిలిపేయాలని తన క్లయింట్లకు సూచించింది. ఐపీజీ కంపెనీకి పలు ప్రముఖ బ్రాండ్ కంపెనీలు అడ్వర్టయిజ్మెంట్ల కోసం ఏటా వేల కోట్ల రూపాయలు చెల్లిస్తుంటాయి.
To all complainers, please continue complaining, but it will cost $8
— Elon Musk (@elonmusk) November 2, 2022