కేరళ కాసర్కోడ్ అనంతపద్మనాభస్వామి కోనేరులో 70ఏళ్లుగా ఉంటున్న మొసలి బబియా కన్ను మూసింది. కేవలం స్వామికి పెట్టే ప్రసాదాలు మాత్రమే తినే శాకాహారి అది. అంతే కాదు చెరువులోని చేపలను కూడా తినదని భక్తులు చెబుతుంటారు. రోజూ స్వామి పూజ అనంతరం… ఎంతో భక్తితో నైవేద్యం పెట్టే సమయానికి వచ్చి భక్తులెవరికీ ఇబ్బంది కలగకుండా ప్రసారం తిని కోనేరులోకి వెళ్లేది. అందుకు సంబంధించి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజులుగా బబియా నీరసించి కనిపిస్తోంది. వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలని చెబుతున్నారు. పరిస్థితి విషమించి నిన్న తెల్లవారుజామున కన్నుమూసిందా మొసలి. బబియాను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. పొలిమేరలో దానికి అంతిమ సంస్కారాలు చేశారు.
https://twitter.com/samck004/status/1579299491332894720?s=20&t=e3aOSeXmEVihdoLZ60WPBg
https://twitter.com/adarshahgd/status/1579397051863138304?s=20&t=e3aOSeXmEVihdoLZ60WPBg