అండమాన్ & నికోబార్ పోర్ట్ బ్లెయిర్ లో వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన ఫోటోలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. బ్రిటీష్ పాలనలో వీర్ సావర్కర్ ఇవే దీవుల్లో ఉన్న సెల్యులార్ జైలులో రెండు జీవిత ఖైదు శిక్షలను అనుభవించారు. విమానాశ్రయంలో త్వరలో నూతన టెర్మినల్ భవన నిర్మాణం పూర్తి కానుంది. ప్రయాణీకుల రద్దీ కారణంగా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తిగా నూతన టెర్మినల్‌ను దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించే పనిని ప్రారంభించింది.
మొత్తం 40,837 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన నూతన టెర్మినల్ రద్దీ సమయాల్లో 1200 మందిని.. సంవత్సరానికి 40 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు.
నూతన ప్యాసింజర్ టెర్మినల్ నిర్మాణంలో లో గ్రౌండ్, హై గ్రౌండ్ సహా మొదటి అంతస్తు మూడు స్థాయిలుగా ఉండనుంది. లో గ్రౌండ్ ను ఫ్లోర్ రిమోట్ అరైవల్, బస్ లాంజ్ సహా సర్వీస్ ఏరియాగా ఉపయోగిస్తారు. పై అంతస్తును ప్యాసింజర్ డిపార్చర్ సహా అరైవల్ యాక్సెస్‌గా ఉపయోగిస్తారు. టెర్మినల్ షెల్ ఆకారపు భవనం వలె రూపొందించబడింది. ఈ భవనం అల్యూమినియం షీట్ రూఫింగ్, చుట్టూ కేబుల్ నెట్ గ్లాస్‌తో 120 మీటర్ల పొడవు స్టీల్ ఫ్రేమ్డ్ తో నిర్మించారు.
అదనపు ఆప్రాన్ ప్రాంతం నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది, ఇది ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ కోసం నాలుగు అదనపు వే లను అందిస్తుంది. ప్రాజెక్ట్ పనులు 80% పూర్తయ్యాయి, ఈ ప్రాజెక్ట్ అక్టోబర్ 2022 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేశారు సంబంధిత అధికారులు.
వీర సావర్కర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడం ద్వారా పర్యాటక వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది, తత్ఫలితంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ప్రజలకు కొత్త ఉద్యోగ అవకాశాలను అందడమే కాకుండా మెరుగైన విద్య, వైద్య సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.
https://twitter.com/AAI_Official/status/1527219060219740161?s=20&t=KBaleKHjSc6esgR4zSQnsA