అమెరికాలో వేదిక్ యూనివర్సిటీ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు సంతోష్ కుమార్, విజయ్ ప్రభాకర్, వాసవీ చెక్కా ఈ యూనివర్సిటీని స్థాపించారు. ఈ డిజిటల్ యుగంలో సనాతన భారతీయ పద్ధతులు, విలువల్ని, హిందుత్వ తత్వాన్ని పరిరక్షించడం, ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ వెల్ నెస్ ను ప్రారంభించినట్టు డీన్ వాసవి చక్కా తెలిపారు. గ్రేటర్ చికాగోలో 38 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సర్టిఫికెట్ , బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులను యూనివర్సిటీ అందించనుంది.