తెలుగు నాట వాడ వాడలా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డ మీద అనేక చోట్ల శిశుమందిర్ విద్యాలయాల్లో వసంత పంచమి నిర్వహించారు. ముందుగానే ఆచార్యులు, మాతాజీలు చుట్టుపక్కల గ్రామాల్లో యోజన చేయటంతో కార్యక్రమం విజయవంతం అయింది. అనేక చోట్ల సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
గత కొన్ని సంవత్సరాలుగా శిశుమందిర్ స్ఫూర్తితో ఇతర విద్యాలయాల్లో కూడా వసంత పంచమి నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని సోనాల మండల కేంద్రంలో వివేకానంద పాఠశాల లో పండగ చేశారు. వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోనాల మండలంలోని వివిధ
గ్రామాల నుండి చిన్నారులు వారి తల్లిదండ్రులతో హాజరై అక్షరాభ్యాసం చేయించుకున్నారు. అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులకు పలక,బలపం సరస్వతి దేవి ఫోటో ఉచితంగా అందించడం జరిగింది. అక్షరాభ్యాసం అనంతరం తీర్థప్రసాద వితరణ చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ వసంత పంచమి విశిష్టతను తెలియజేశారు.అక్షరాభ్యాసం అనంతరం హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య యాజమాన్య సిబ్బంది శుద్ధొధన్, మునిగెల శ్రీధర్, హరీష్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.