వరుణ్ గాంధీ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ భావజాలం, తన భావజాలం పూర్తి విరుద్ధమన్నారు. తాను ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లే ప్రసక్తే లేదని…అది జరగాలంటే తన తల తెగిపోవాలని అన్నారు. మా కుటుంబానికి ఓ సిద్ధాంతం, భావజాలం ఉన్నాయని…. వరుణ్ అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని నేను అంగీకరించలేనని అన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా పంజాబ్లోని హోషియార్పూర్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యాలయానికి వెళ్లే ప్రసక్తే లేదని, అది జరగాలంటే తన తల తెగిపోవాలని అన్నారు. వరుణ్ గాంధీ కొంతకాలంగా బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అలాగే ప్రియాంక వాద్రాతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని… బీజేపీని వీడి కాంగ్రెస్ లోచేరవచ్చని ప్రచారం జరుగుతోంది