బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించేందుకు కాంగ్రెస్ పార్టీ వెరైటీ గా ప్లాన్ చేసింది. ప్రభుత్వ తీరుపై పదే పదే చేస్తున్న విమర్శలను ఎండ గడుతూ ఫ్లెక్సీలు పెట్టారు.
హైదరాబాద్ లోని ముఖ్య కూడళ్లలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్, కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు కావాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ముఖ్య కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేసి కలకలం రేపుతున్నారు.
దావోస్ పర్యటనలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, రికార్డు సృష్టించిన సీఎం రేవంత్ రెడ్డి అని ఇందులో రాశారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వలో, కాంగ్రెస్ పరిపాలనలో భారీ పెట్టుబడులను, తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని.. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు మీద విమర్శలు ఎక్కుపెట్టారు.
కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ.. హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! పేరుతో హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.
#DigestTheGrowth పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద ఈ వెరైటీ ఫ్లెక్సీలు నగరం లో సందడి చేస్తున్నాయి.