ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే గా పాటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వాలంటైన్స్ నామస్మరణతో మన యువత ఊగిపోతూ ఉంటారు కానీ వాలంటైన్స్ అసలు స్వరూపం తెలిస్తే బుర్ర తిరిగిపోతుంది.
వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ మతోన్మాది.
అప్పట్లోనే వాలెంటైన్‌ను క్రైస్తవేతరుల, పాగన్ దేవుళ్ల విగ్రహాల విధ్వంసకారుడిగా అభివర్ణించారు. క్రైస్తవేతర దేవుళ్లను అసభ్యంగా నిందిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేవాడు.
వాలెంటైన్ ఎంతటి మతోన్మాది అంటే.. క్రైస్తవంపై విశ్వాసం లేకుండా పాగన్ల దేవుడైన జూపిటర్ ను ఆరాధిస్తున్న తన తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వైద్యం చేయడానికి నిరాకరించాడు. చివరికి ఆమె ఆ వ్యాధితోనే కన్నుమూసింది.
మతోన్మాదంతో ఇతర మతాలకు చెందిన దేవుళ్లను తీవ్రంగా దూషిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టిస్తున్న వాలెంటైన్ ను.. రోమన్లు అరెస్ట్ చేశారు. తన ఉన్మాదాన్ని తగ్గించుకుంటే విడుదల చేద్దామనే ఉద్దేశంతో వారు అతడిని “మా దేవుళ్లపై నీ అభిప్రాయం ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు అతను తీవ్రమైన పదజాలంతో దూషించాడు.
దీనిని బట్టి వాలెంటెన్స్ అసలు స్వరూపం అర్థం అవుతుంది. కానీ ఇంతటి మతోన్మాది పేరుని ప్రేమకు గుర్తుగా క్రైస్తవ మత సంస్థలు ప్రచారంలోకి తీసుకుని వచ్చాయి. అంతిమంగా మతమార్పిడికి విశ్వాసాల మార్పిడికి ఇది దారితీస్తుందని వేరే చెప్పక్కర్లేదుగా.