వాలంటైన్స్ పేరుతో “టాటా” లింక్ వైరల్.. అసలు విషయం చెప్పిన పోలీసులు
మరో వారం పది రోజుల్లో వాలంటైన్ష్ డే వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచంలో అనేక దేశాలు వాలంటైన్స్ డే అని జరుపుకుంటారు. అయితే కార్పోరేట్ సంస్థలు మాత్రం ఇదే అదనుగా కోట్ల రూపాయల వ్యాపారానికి తెరలేపుతారు. ఇక మన దేశంలో కూడా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు పలు నగరాల్లో జరుగుతున్నాయి. అయితే ఈ వాలంటైన్ దినాన్ని వ్యాపారంగా మార్చుని డబ్బులు పోగుచేసుకునేందుకు అనేక మంది కేటుగాళ్లు రెడీ అయ్యారు. అయితే అమాయక ప్రజలను వాలంటైన్ డే పేరుతో మోసం చేసి.. వారి ఫోన్లలో ఉన్న డాటాను చోరీ చేసుకునేందుకు ఓ సైబర్ మూఠ రెడీ అయ్యింది. అనుకున్నదే తడవుగా టాటా సంస్థ పేరుతో ఓ ఫేక్ లింకును క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. సులువైన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే.. మీరు ఓ మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా పొందుతారంటూ ఆ లింకుపైన టైటిల్ పెట్టి.. షేర్ చేస్తున్నారు. విషయం తెలియని మొబైల్ యూజర్స్ ఆ లింకును అనేక సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఇది గమనించిన తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు అది ఫేక్ లింక్ అని తేల్చి చెప్పారు. టాటా పేరుతో డాటా చోరీ అయ్యే అవకాశం ఉందని.. దయచేసి అలాంటి లింక్స్‌ను ఓపెన్ చేయోద్దంటూ విన్నవించుకుంటున్నారు. సో బీ అలర్ట్.. మీరంతా కూడా టాటా పేరుతో వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేయకుండా ఉండండి.
