తెలంగాణలో వాక్సినేషన్ ప్రక్రియ మళ్లీ మొదలైంది. పని చేసే ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సినేషన్ నిర్వహించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు జీవోను విడుదల చేసింది. అయితే సూపర్ స్ప్రెడర్స్కు ఈనెల 28 నుంచి టీకాలు వేయనున్నారు. రాష్ట్రంలో 30 లక్షల వరకు సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని ప్రభుత్వం అంచనా. షాప్ కీపర్స్, సెలూన్స్, మెడికల్ షాప్స్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు సూపర్ స్ప్రెడర్స్ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.