ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు.కొత్త కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతిపట్ల… ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. “కల్యాణ్ సింగ్ మరణం తనకు పెద్ద దుఃఖమని, గొప్ప రాజనీతిజ్ఞుడిని, ప్రజానాయకుడిని, గొప్ప మానవతావాదిని కోల్పోయామని.. యూపీ అభివృద్ధిలో ఆయన పాత్ర ప్రముఖమైనదీ’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మరణం తీవ్ర బాధను మిగిల్చిందని,..ప్రజలకు సేవ చేయడంలో ఆదర్శ ప్రాయుడు అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
కల్యాణ్ సింగ్ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్షా తీవ్ర సంతాపం చేశారు. ఆయన తన జీవితాన్ని దేశానికి, ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. జాతీయ వాదిగా ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని రాత్రి ట్వీట్ చేశారు.