ఎన్నికల విరాళాల మీద కుండబద్దలు కొట్టిన ట్రంఫ్..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ సంచలనాలకు పెట్టింది పేరు. ఆయన వ్యాఖ్యలు, ప్రకటనలు వివాదాలు రేపుతూ ఉంటాయి. ఈ సంచలనాల వెనుకగా ఆయన పనులు ఆయన చక్క పెట్టేసుకొంటూ ఉంటారు. నిఖార్సయిన వ్యాపారవేత్త మాదిరిగానే రాజకీయాలు నడపటం ట్రంఫ్ కు అలవాటు. ఈ సారి భారత రాజకీయాల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
….
భారత దేశం ఎన్నికల్లో అమెరికా సంస్థలు, వ్యక్తుల హస్తం ఉందని డొనాల్డ్ ట్రంఫ్ అభిప్రాయ పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఒక పార్టీ గెలుపుకోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నం చేశారని బాంబు పేల్చారు. ఇందుకోసం ప్రభుత్వం తరపు నుంచే కోట్ల రూపాయలు తరలి వెళ్లాయి అని అంటున్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఏమిటి అనేది చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఇందుకు సంబంధించి ట్రంఫ్ కొన్ని లెక్కలు చెప్పారు.
#WATCH | Miami, Florida | Addressing the FII PRIORITY Summit, US President Donald Trump says, “… Why do we need to spend $21 million on voter turnout in India? I guess they were trying to get somebody else elected. We have got to tell the Indian Government… This is a total… pic.twitter.com/oxmk6268oW
— ANI (@ANI) February 20, 2025
…
భారత్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా కొంత కాలంగా విరాళాలు ఇస్తోంది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు, వారిని ఓటింగ్‌లో పాల్గొనేలా చేసేందు కోసం అమెరికా 21 మిలియన్ డాలర్ల ఫండ్ ఇస్తున్నది. ఇది అమెరికాకు అనవసరపు ఖర్చు, దీన్ని రద్దు చేయాలంటూ అమెరికా లోని సుపరిపాలన విభాగం సూచించింది. ఈ విభాగం పూర్తిగా ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ విరాళాలను నిలిపి వేయాలని తాజాగా .. ట్రంఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. భారతదేశ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచటం మనకు ఎందుకు అని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు.
….
అసలు భారత దేశంలో ఓటింగ్ కోసం అమెరికా ఎందుకు నిధులు ఇవ్వాలి? అమెరికాలో ఎంత మంది ఓటర్లు ఓటింగ్ వేస్తున్నారు? అంటూ ట్రంఫ్ ప్రశ్నించారు. భారత ప్రజలు, ప్రధాని మోదీ అంటే తనకు గౌరవం ఉందని, అయినా కూడా ఈ ఓటర్ బూస్టింగ్ ఫండ్స్‌ను రద్దు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అంతేగాకుండా.. భారత్ లోని ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని బాంబు పేల్చారు.
..
వాస్తవానికి చాలా కాలంగా అమెరికా సంస్థల నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ టీమ్ కు విరాళాలు వస్తున్నాయి. మొన్న బంగ్లాదేశ్ లో అల్లర్లు రేకెత్తించటానికి కూడా అమెరికా నుంచి ఫండ్స్ వచ్చిపడ్డాయి. అదే మాదిరిగా కొన్ని ఎన్జీవోల పేరుతో రాహుల్ గాంధీ టీమ్ కు అమెరికా నుంచి విరాళాలు వస్తున్నాయి. దీనిని బట్టి భారత్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అమెరికా లోని కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయన్న మాట వినిపిస్తోంది.
…
మొత్తం మీద భారత్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం.. విదేశీ సంస్థలు ఎందుకు ప్రయత్నాలు చేశాయన్నది చర్చనీయాంశం గా మారింది. దీనిని బట్టి చాలా కాలంగా విదేశీ శక్తుల కోసం భారత్ లోని కాంగ్రెస్ పెద్దలు పనిచేస్తూ వచ్చారు అని తెలిసిపోతోంది. మొత్తం మీద ట్రంఫ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పెద్దలు భుజాలు తడుముకుంటున్నారు.