……………………….
అంతర్జాతీయ వేదికపై భారత్ సత్తాను చాటుతూ, ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రాత్మక దౌత్య విజయాన్ని అందుకున్నారు. భారత్-అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన ‘మధ్యంతర వాణిజ్య ఒప్పందం’ ముసాయిదా విడుదల అయింది. ఈ ముసాయిదాలో భారత్ ప్రయోజనాలు కాపాడటంలో … మోదీ అనుసరించిన తిరుగులేని వ్యూహరచన స్పష్టంగా కనిపిస్తోంది. తనదైన శైలిలో అగ్రరాజ్యాన్ని మెప్పించి, ఒప్పించడంలో మోదీ సఫలీకృతులయ్యారు.
………………………………….
ప్రపంచ రాజకీయాల్లో భారత్‌ను ఒక శక్తివంతమైన ధ్రువంగా ప్రధాని మోదీ మార్చగలిగారు. అమెరికాను చర్చలకు ఒప్పించేందుకు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఒకవైపు యురోపియన్ యూనియన్ తో వాణిజ్య చర్చలను వేగవంతం చేయడం, మరోవైపు అరబ్ దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా అమెరికాపై పరోక్షంగా ఒత్తిడి పెంచారు. భారత్ తన వాణిజ్య అవసరాల కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడదని, ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉన్నాయని చాటిచెప్పారు. త ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. భారత్‌తో ఒప్పందానికి మొగ్గు చూపేలా చేయడంలో మోదీ వ్యూహం ఫలించింది.
……………………..
ఒప్పందంలోని ముఖ్యాంశాలు చూస్తే…. భారత్‌కు అనేక కీలక రాయితీలు లభించాయి అని అర్థం అవుతుంది.
ప్రతీకార సుంకాల రద్దు: రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో అమెరికా విధించిన 25 శాతం అదనపు సుంకాలను పూర్తిగా రద్దు చేసేలా మోదీ అమెరికాను ఒప్పించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట.
ఎగుమతులకు ఊతం: భారత వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ప్లాస్టిక్, ఆర్గానిక్ కెమికల్స్ వంటి రంగాలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ పెరగనుంది.
రక్షణ & విమానయాన రంగం: స్టీల్, అల్యూమినియంపై ఉన్న పాత ఆంక్షల నుంచి భారత విమాన విడిభాగాలకు మినహాయింపు లభించడం మోదీ దూరదృష్టికి నిదర్శనం.
ఫార్మా & ఆటోమొబైల్: భారత జనరిక్ మందులు, ఆటోమొబైల్ విడిభాగాలకు అమెరికాలో ప్రత్యేక కోటా దక్కడం ద్వారా దేశీయ పరిశ్రమలకు కొత్త వెలుగులు రానున్నాయి.
…………………………………
ఒకప్పుడు ఆంక్షలతో భయపెట్టాలని చూసిన అమెరికాను మోదీ లొంగదీశారు. భారత్ కు పెద్ద పీట వేస్తూ ఒప్పందం చేసుకుంటోందంటే… అది కేవలం మోదీ నాయకత్వ ప్రతిభే. రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా భారత్‌ను ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా మోదీ నిలిపారు. ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేస్తూ, అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యక్తిగత కృషికి మోదీ ధన్యవాదాలు తెలిపారు, ఇది ఇద్దరు ప్రపంచ నేతల మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తోంది.



