అంటువ్యాధుల నివారణ, వ్యాధి ముప్పులను ముందుగానే గుర్తించడం కోసం మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు $122 మిలియన్ల నిధులను అమెరికా ప్రకటించినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) బుధవారం తెలిపింది. ఐదేళ్ల వ్యవధిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE)లకు ఈ నిధులు అందిస్తారు. ICMR అనేది అనేక జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లకు అపెక్స్ గవర్నింగ్ బాడీ. కోవిడ్ వాక్సిన్ కనుగొనడంలో ఈ సంస్థలు ఎంతో శ్రమించాయి.