ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నటి కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓటర్ లకు ఓటుహక్కు ని సరైన దిశగా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ (బిజెపి) ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, తన అభిమానులు, అనుచరులను యోగికి ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ విషయమై సోషల్ మీడియా లో వీడియో షేర్ చేశారు.
వీడియో లో కంగనా మాట్లాడుతూ ” ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాజకీయ పోరులో మనకున్న ఏకైక ఆయుధం మన ‘ఓటు’. గుర్తుంచుకోండి, మనం యోగి ప్రభుత్వాన్ని పునఃస్థాపించాలి, అలా చేయడానికి మనం ఆయనకి పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలి. మీరు ఓటు వేసేటప్పుడు కనీసం ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులను మీతో తీసుకురండి” అని అన్నారు.
మణికర్ణిక నటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తరచుగా తన మద్దతును ప్రకటిస్తుటుంది.
కంగనా రనౌత్ ఇదివరకే యూపీ “వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రోడక్ట్” స్కీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు, యుపిలో మొదట తపసవి రాజా శ్రీ రామ్ చంద్ర ఉన్నారు, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నారని అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)