ఉత్తరప్రదేశ్ లో మళ్లీ అధికారం తమదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 300 కు పైగా స్థానాలు గెలుచుకుని అధికారం కాపాడుకుంటామని అన్నారు. కన్నౌజ్, జలన్ లలో అమిత్ షా ప్రచారం నిర్వహించారు.
ఐదేళ్ల యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్ నుంచి గూండాలంతా పారిపోయారని కొనియాడారు. గతంలో సామాన్య ప్రజలు భయంతో రాష్ట్రం విడిచి వెళ్ళేవారని, కానీ ఇప్పుడు నేరస్థులు పారిపోవలసి వస్తుందనీ అన్నారు. అఖిలేష్ ఐదేళ్ల పాలనలో 700కు పైగా దమ్మీలు జరిగాయని గుర్తు చేశారు. యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగించడం కోసం 2014, 2017, 2019 తర్వాత రాష్ట్రంలో బిజెపికి వరుసగా నాలుగవ సారి విజయాన్ని అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ పాలనలో ప్రతి జిల్లాకు ఓ రాజకీయ బలవంతుడు, ఒక మినీ సీఎం ఉండేవాడని… బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాలో ఒక ఉత్పత్తి , ఒక పరిశ్రమ, వైద్యకళాశాల ఉన్నాయని షా అన్నారు.