తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా నగరానికి చేరుకున్నారు. యోగి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగి తోపాటు బండి సంజయ్, లక్ష్మణ్, రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు.
आज हैदराबाद स्थित श्री भाग्यलक्ष्मी मंदिर में माँ लक्ष्मी जी के पावन दर्शन-पूजन से मन अभिभूत है।
माँ लक्ष्मी सभी का कल्याण करें। सभी के जीवन में सुख, शांति और समृद्धि का वास हो।
जय माँ भाग्यलक्ष्मी! pic.twitter.com/Nn7N5gBknb
— Yogi Adityanath (@myogiadityanath) July 3, 2022
యోగి పాతబస్తీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట నిఘా పెట్టారు. భాగ్యలక్ష్మి ఆలయం చుట్టూ 500 మీటర్ల దూరంలో మూడు వలయాల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం350మంది పోలీసులతో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రత కొనసాగించారు. హెచ్ఐసీసీ నుంచి 7:30కు బయలుదేరి భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు యోగి 8 గంటలకు చేరుకోనున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ను ఎస్పీజీ కమాండోస్ తమ అధీనంలోకి తీసుకున్నారు.