నేడు ఏప్రిల్ 14వ తేదీ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి.. వారిని గుర్తు చేసుకుంటూ ఈ వివరాలు తెలుసుకుందాం.
ఈ తరం వారికి తెలిసింది ఏంటంటే అంబేద్కర్ హిందూ ధర్మాన్ని నిరసించారు, అందుకే బౌద్ధం స్వీకరించారు అని. నిజమే! హిందూ ధర్మంలో అంటరానితనం, కుల వివక్షను అంబేద్కర్ గట్టిగా విమర్శించారు. అందుకే ఆయన మాటలను అడ్డుపెట్టుకుని హిందూ ధర్మ ద్వేషులు ముఖ్యంగా వామపక్ష మేధావులు హిందూ ధర్మం మీద ఎంత విషం కక్కాలో అంతా 75సం.లుగా కక్కుతూనే ఉన్నారు.
అంబేద్కర్ కు హిందూ ధర్మం నచ్చలేదు, దానిలో వివక్ష నచ్చలేదు, బౌద్ధం స్వీకరించారు అని పదే పదే చెప్పే మేధావులు అదే అంబేద్కర్ ప్రపంచంలోనే అప్పటికే అతి బలమైన, ధనికమైన అబ్రాహామిక్ మతాలైన క్రిష్టియనిటీని గాని ఇస్లాంను గాని ఎందుకు స్వీకరించలేదో చర్చలోకి రాకుండా ఇన్నాళ్లుగా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎంతో ధనం, ఎన్నో ప్రలోభాలు ఆశ చూపినా ఆయన అబ్రాహామిక్ మతాలలోకి పోలేదు. ఈ హిందూ ద్వేష మేధావులు ఆ విషయంపై ఎప్పుడు అయినా పెద్దగా చర్చలు జరిపారా? సెమినార్లు నిర్వహించారా? , పుస్తకాలు, వ్యాసాలు రాసారా? రాయలేదు.
కారణం? ఈ అబ్రాహామిక్ మతాలుపై అంబెద్కర్ అభిప్రాయాలు ఈ మేధావుల హిందూ ద్వేషం, సెక్యూలర్ అజెండాకు సరిపోవు. అంబేద్కర్ రాసిన “Anhiliation of castes” (AOC) అనే పుస్తకానికి ఇచ్చిన ప్రచారం లో ఒక శాతం కూడా “Pakistan or Partition of India” (PPI)అనే పుస్తకానికి(1940లో మొదటి ప్రచురణ) కల్పించలేదు. ఎందుకంటే మొదటి పుస్తకం AOCలో అంబేద్కర్ హిందూ ధర్మాన్ని విమర్శించారు కాబట్టి దానికి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు విపరీత ప్రచారం కల్పించి హిందూ ధర్మాన్ని విమర్శించారు. కానీ రెండో పుస్తకం PPI లో ఇస్లాం ని తీవ్రంగా విమర్శించారు కాబట్టి ఈ సెక్యూలర్ మేధావులు ఆ పుస్తకం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఇంటర్నెట్ రావడం వల్ల ఈ PPI పుస్తకానికి ప్రచారం లభిస్తోంది.
సరే! హిందూ ధర్మాన్ని అంబేద్కర్ ఎంత ద్వేషించినా.. ఆయన రెండు దశాబ్దాలకు పైగా పరిశీలించి ఈ దేశానికి సంస్కృతికి అసలు ఏ మాత్రం సంబంధం లేని అబ్రాహామిక్ మతాలను కాదని చివరకు ఈ గడ్డపై పుట్టిన బౌద్దాన్ని మాత్రమే స్వీకరించారు. ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయింది కాబట్టి ఇస్లాం పై అంబేద్కర్ అభిప్రాయం ఏమిటో ఈ పోస్టులో క్లుప్తంగా తెలుసుకుందాం.
అంబేద్కర్ పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ అనే పుస్తకంలో ఇస్లాం పై వెలిబుచ్చిన అభిప్రాయాలు నేటి కాలంలో ఎవరైనా వెలిబుచ్చితే వారిని వెంటనే “ఇస్లాం ద్వేషులుగా” అంటే ఇస్లామోఫోబిక్ అని, హిందుత్వ వాదులని, సంఘ్ మతతత్వ వాదులు అని ముద్ర వేసేవారు. అసలు అంబేద్కర్ ఆ పుస్తకంలో ఏం రాసారో చూడండి.
1. హిందూ మతం ప్రజలను విభజిస్తుందని.. దీనికి విరుద్ధంగా, ఇస్లాం ప్రజలను ఒకరితో ఒకరిని కలుపుతుంది అని చెప్పబడుతుంది. కానీ ఇది అర్ధ సత్యం మాత్రమే. ఎందుకంటే ఇస్లాం ఎంత కలుపుతుందో అంతకంటే ఎక్కువగా విభజిస్తుంది. ఇస్లాం ఒక మరుగైన (క్లోజ్) సంస్థ, అది ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య చూపించే వ్యత్యాసం చాలా నిజమైనది, చాలా సానుకూలమైనది. ఇస్లాం సోదరభావం మానవ సార్వత్రిక సోదరభావం కాదు. ఇది ముస్లింలకు మాత్రమే ముస్లింల మధ్య మాత్రమే సోదరభావం. నిజమే సోదరభావం ఉంది, కానీ దాని ప్రయోజనం ఆ కార్పొరేషన్‌లోని వారికి మాత్రమే పరిమితం. కార్పోరేషన్ వెలుపల ఉన్నవారికి ధిక్కారం, శత్రుత్వం తప్ప మరేమీ లేదు ”అని బిఆర్ అంబేద్కర్ ‘పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా’లో రాశారు.
2. అలాగే అంబేద్కర్ స్థానిక స్వపరిపాలనతో ఇస్లాం అననుకూలతను కూడా విశదీకరించారు. ముస్లిం ఉమ్మా ఇస్లామిక్ భావజాలాన్ని నొక్కి చెబుతూ, అంబేద్కర్ ఒక ముస్లిం విధేయత దేశంలో అతని నివాసంపై ఆధారపడి ఉండదు, అతనికి చెందిన విశ్వాసం అయిన ఇస్లాం మీద ఆధారపడి ఉంటుంది. అంబేద్కర్ ప్రకారం, భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడానికి నిజమైన ముస్లింను ఎన్నటికీ ఇస్లాం అనుమతించలేదు. అలా జరగాలంటే ఇక్కడ ఇస్లామిక్ పాలనా స్థాపన తప్పనిసరి.
హిందూ మెజార్టీగా ఉన్న భారత్ వారికి ఇస్లాం వ్యాప్తికి ఒక అవకాశం.
3. ఇస్లాం పట్ల తన విధేయత వల్ల ఒక ముస్లిం తను నివసిస్తున్న దేశానికి అతని విధేయత పై ప్రశ్నకు అంబేద్కర్ ఇలా వ్రాశాడు:
“సిద్ధాంతాలలో, నోటీసుకు పిలుపునిచ్చేది ఇస్లాం సిద్ధాంతం, ఇది ముస్లిం పాలనలో లేని దేశంలో, ముస్లిం చట్టానికి, దేశ చట్టానికి మధ్య ఎక్కడ వైరుధ్యం ఉన్నా, ముస్లిం చట్టం దేశ చట్టం పై విజయం సాధించాలి, ముస్లిం చట్టాన్ని పాటించడంలో, భూమి చట్టాన్ని ధిక్కరించడంలో ఒక ముస్లిం సమర్థించబడతాడు… ఒక ముసల్మాన్, పౌరుడైనా లేదా సైనికుడైనా, ముస్లిం క్రింద లేదా ముస్లిమేతర పరిపాలనలో జీవించినా, ఖురాన్ ఆదేశిస్తున్న ఏకైక విధేయత దేవుని పట్ల, అతని ప్రవక్త పట్ల మాత్రమే.
4. పవిత్ర ఖురాన్ బోధన వల్ల సుస్థిర ప్రభుత్వం ఉనికి దాదాపు అసాధ్యం అని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, ఒక దేశం ముస్లింలకు మాతృభూమిగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కాదు అని చెప్పే ముస్లిం సిద్ధాంతాలను చూసి అంబేద్కర్ మరింత ఆందోళన చెందారు.
“ముస్లిం కానన్ చట్టం ప్రకారం, ప్రపంచం రెండు శిబిరాలుగా విభజించబడింది, దార్-ఉల్-స్లామ్ (ఇస్లాం యొక్క నివాసం), దార్-ఉల్-హర్బ్ (యుద్ధ నివాసం). ఒక దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు అది దార్-ఉల్-ఇస్లాం. అదే ఒక దేశం లో ముస్లింలు నివసిస్తున్నారు, కానీ దాని పాలకులు వారు కాదు. దానినే దార్-ఉల్-హర్బ్ అంటారు.. అంతేకాదు దార్-ఉల్-హర్బ్ ని దార్-ఉల్-స్లామ్ గా మార్చాలి అని ఆదేశం. అంటే ముస్లింల కానన్ లా ప్రకారం భారతదేశం హిందువులు ముసల్మాన్ల ఉమ్మడి మాతృభూమి కాదు. అది ముసల్మాన్ల భూమి కావచ్చు, కానీ ‘హిందువులు, ముసల్మాన్లు సమానంగా జీవించే భూమి కాకూడదు.’ ఇంకా చెప్పాలి అంటే ఇది ముస్లింల పాలనలో ఉంటేనే అది ముసల్మాన్ల భూమి కావచ్చు. ఒక భూమి ముస్లిమేతర శక్తికి లోబడి ఉన్న క్షణం, అది ముస్లింల భూమిగా భావింపబడదు. అంటే దార్-ఉల్-స్లామ్ కాకుండా, అది దార్-ఉల్-హర్బ్ అవుతుంది, ”అని అంబేద్కర్ వివరించారు.
5. అప్పట్లో కేంద్రంలో ఉండే హిందూ మెజారిటీ ప్రభుత్వానికి ముస్లిం విధేయతపై ప్రశ్నను ప్రస్తావిస్తూ, అంబేద్కర్ ఈ విధంగా అభిప్రాయపడ్డారు.
” ముస్లింలకు హిందువు కాఫీర్. కాఫీర్ గౌరవానికి అర్హుడు కాదు. అతను తక్కువ-పుట్టుక, స్థితి లేనివాడు. అందుకే ఒక కాఫీర్ పాలించే దేశం ముసల్మాన్కి దార్-ఉల్-హర్బ్. దీనిని బట్టి చూస్తే, ముస్లింలు హిందూ ప్రభుత్వాన్ని గుర్తించరని నిరూపించడానికి ఇంతకు మించిన ఆధారాలు అవసరం లేదు. అని బిఆర్ అంబేద్కర్ అన్నారు.
6. ఇస్లాంలో కూడా ఉన్న కుల వ్యవస్థ యొక్క ప్రాబల్యాన్ని తెరపైకి తెచ్చిన ప్రముఖ మేధావులలో అంబేద్కర్ మొదటివాడు. కుల వ్యవస్థ ఉంది అని హిందూమతం పై చాలాకాలంగా నిందలు వేయబడింది, అయితే ఇదే కుల వ్యవస్థ యొక్క ఆధిపత్యం, అంటరానితనం ఆచారం ఇస్లాంలో కూడా విస్తృతంగా ఉందని ఆయన ఎత్తిచూపారు. అష్రఫ్‌లు, అజ్లాఫ్ల మధ్య సామాజిక విభజనతో ముస్లిం సమాజం చితికిపోయిందన్నారు. అష్రాఫ్‌లు అంటే గొప్పవారు, విదేశీ పాలక వర్గానికి చెందిన వారు, మతం మారిన బ్రాహ్మణులు కూడా వీరిలో ఉన్నారు. అయితే అజ్లాఫ్లు మాత్రం దౌర్భాగ్యులు తక్కువ కుల ముస్లింలు అని అంబేద్కర్ చెప్పారు.
అష్రఫ్, అజ్లాఫ్లతో పాటు, అర్జల్స్ అని పిలువబడే మూడవ వర్గం ఉంది అని ఈ వర్గం ముస్లింలలో అత్యంత వివక్షకు గురైన గుంపు అని వారిని అంటరాని వారిగా గుర్తించి ప్రార్థనలు చేయడానికి మసీదుల్లోకి అనుమతి లేదని, ఇతర ముస్లింల వాడే అదే శ్మశాన వాటికలను ఉపయోగించకుండా అర్జర్లు నిషేధించబడ్డారు అని చెప్పారు.
7. బానిసత్వం అనేది చాలా వరకు ఇస్లాం, ఇస్లామిక్ దేశాల నుంచి తీసుకోబడింది. కానీ బానిసత్వం పోయినా ముసల్మాన్లలో కులం మిగిలిపోయింది. హిందూ సమాజాన్ని పీడిస్తున్న సామాజిక దురాచారాల వల్ల భారతదేశంలోని ముస్లిం సమాజం కూడా బాధపడుతుందనడంలో సందేహం లేదు. ముస్లిం మహిళలకు పర్దా నిర్బంధ వ్యవస్థ అంతకన్నా ఎక్కువ” అని అంబేద్కర్ భారతదేశంలో ఇస్లామిక్ సమాజాన్ని పీడిస్తున్న కులతత్వ శాపంగా వివరిస్తూ చెప్పారు.
అంబేద్కర్ అక్కడితో ఆగలేదు. నిజానికి, ముస్లింలకు హిందువులలో ఉన్న సామాజిక దురాచారాలన్నీ ఉండడమే కాక ఇంకా మరెన్నో కూడా ఉన్నాయి అని చెప్తూ బాల్య వివాహాల ప్రాబల్యం, మత అసహనం, బానిసత్వ భావన, తమ విశ్వాసానికి క్రూరంగా కట్టుబడి ఉండటం, సమాజంలో స్త్రీల స్థితిగతులు, బహుభార్యత్వం సహా అనేక ఇతర వివాదాస్పద పద్ధతులపై ఇస్లాంను విమర్శించడంలో అంబేద్కర్ ఎటువంటి సంకోచం పడలేదు.
అందుకని ఎవరైనా ఉదారవాదులు హిందుత్వాన్ని విమర్శించడానికి అంబేద్కర్ ని వాడుకుంటే ఈ పోస్ట్ లో రాసిన విషయాలతో వారిని అంబేద్కర్ ఇస్లాం పై రాసిన పై విషయాలపై ఎందుకు ప్రచారం చేయలేదు? ఎందుకు ఈ ద్వంద వైఖరి అవలంబించారు అని నిలదీయండి.
ఈ పోస్ట్ లో రాసిన ప్రతీ విషయం అంబేద్కర్ గారు రాసిన “పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ అఫ్ ఇండియా” అనే పుస్తకం నుంచి తీసుకోబడ్డాయి.
~ Chada Sastry
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)