అమెరికాలోని హిందూ కమ్యూనిటీ ఇన్ స్టిట్యూట్ HCI, మోత్వాని జడేజా ఫౌండేషన్ (MJF) యూనివర్సిటీలు…. హిందూ చాప్లెన్సీ పేరుతో కొత్త ఫెలోషిప్ ప్రోగ్రామ్ ను ప్రకటించాయి. ఈ కార్యక్రమం క్రింద విశ్వవిద్యాలయాలలో హిందు మత గురువులుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రొఫెసర్లకు కల్పిస్తోంది.విశ్వవిద్యాలయాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని..ఆ డిమాండ్ వల్లే ఈ చొరవ తీసుకుని ప్రవేశపెట్టినట్టు హెచ్సీఐ ప్రెసిడెంట్ కైలాస్ జోషి అన్నారు. యూఎస్ లో హిందూ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని…వారికి అర్హత కలిగిన గురువుల అవసరం ఉందని పేర్కొన్నారు MJF అధ్యక్షురాలు ఆషా జడేజా. HCI ఈ కోర్సును ముందుగా స్టాన్ఫోర్డ్, UC బర్కిలీలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
కొత్త ఫెలోషిప్పై, “గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్ (GTU)లోని ఇంటర్రిలిజియస్ చాప్లిన్సీ ప్రోగ్రామ్ (ICP) అన్ని సంప్రదాయాలకు చెందిన మేధావులు, పండితులను ఆహ్వానిస్తున్నారు. హిందూ సంప్రదాయం గొప్పతనాన్ని క్యాంపస్ లు, ఆస్పత్రులు సహా అవసరమైన అన్ని ప్రదేశాల్లో అందించేందుకు అనుమతిస్తామని గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్ డైరెక్టర్ డాక్టర్ కమల్ అబు-షమ్సీహ్ అన్నారు. ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీకి చెందిన ప్రఖ్యాత వేద పండితుడు మరియు కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొ. సుభాష్ కాక్ జోడించారు, “క్యాంపస్లలో హిందూ మత చాప్లిన్సీకి తన మద్దతుంటుందని… ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రఖ్యాత పండితులు, కంప్యూటర్ శాస్త్రవేత్త డా. సుభాష్ కాక్ అన్నారు.
I’m delighted to announce support for university based Hindu chaplains in America. Our fellows will be largely university professors in various departments. We are hoping to start w Stanford & UC Berkeley. 🎈 pic.twitter.com/21g3CPg0mq
— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) May 13, 2022
హిందూ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ ను 2018లో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థాపించారు. ఇది హిందూ సంప్రదాయం, జ్ఞానం ఆధారంగా గ్లోబల్ కమ్యూనిటీ సేవ కోసం బలమైన ప్రాతిపదికన హిందూ కౌన్సెలర్లు,చాప్లిన్ల శిక్షణను అందిస్తుంది.. HCI యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుండి విద్యావేత్తలు సహకారం తీసుకుంటోంది. ఇక మోత్వాని జడేజా ఫౌండేషన్ కూడా అలాంటిదే. బే ఏరియా, న్యూయార్క్, భారత్ లో సంస్థ కార్యాలయాలున్నాయి. అనేక IT పరిశ్రమలు, విద్యావేత్తలలో ప్రపంచవ్యాప్తంగా తన విధులతో ప్రభావం చూపుతోంది.