రాహుల్ దళిత యువతిని పెళ్లి చేసుకోవాలి.. యూత్‌కు ఆదర్శంగా ఉండాలంటున్న కేంద్ర మంత్రి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ దళిత మహిళను వివాహం చేసుకోవాలంటూ కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. తద్వారా మహాత్మా గాంధీ కోరకున్న సమ సమాజ నిర్మాణానికి మీరు దోహదం చేసిన వారు అవుతారని రాందాస్ అథవాలే చెప్పుకొచ్చారు. కులాంతర వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహం కింద రాహుల్‌కు రూ.2.5 లక్షలు కూడా ఇస్తామన్నారు. ఇలా చేయడం ద్వారా కుల వ్యవస్థను నిర్మూలించి.. సమ సమాజాన్నినిర్మించాన్న మహత్మా గాంధీ కలలను సాకారం చేసినట్లు అవుతుందన్నారు.
జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఫిబ్రవరి 16వ తేదీన మీడియాతో మాట్లాడిన సందర్భంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఇద్దరం, మాకిద్దరు అన్న నినాదాన్ని గతంలో కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగించేవారని.. రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ నినాదానికి ప్రాచుర్యం కల్పించాలనుకుంటే తొలుత ఆయన వివాహం చేసుకోవాలని.. అది కూడా ఓ దళిత అమ్మాయిని వివాహమాడి.. కులవివక్షను రూపుమాపాలన్నారు. దీంతో మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేసిన వారు అవుతారని.. ఇలా చేయడం ద్వారా యువతకు కూడా మీరు స్పూర్తిగా ఉంటారని అథవాలే అన్నారు.