బట్టతలపై వ్యాఖ్యలు చేయడం కూడా సెక్సువల్ హెరాస్ మెంట్ కింద పరిగణించవచ్చని తీర్పునిచ్చింది యునైటెడ్ కింగ్డమ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ . కార్యాలయ ప్రదేశంలో ఒక వ్యక్తి బట్టతలపై వ్యాఖ్యలు చేయడం వేధింపులే అంది. స్త్రీల కంటే పురుషులలో జుట్టు రాలడం ఎక్కువగా జరుగుతున్నందున, కార్యాలయంలో పురుషుల బట్టతల గురించి మాట్లాడడం అంటే… స్త్రీ రొమ్ముల పరిమాణంపై మాట్లాడ్డం వంటిదని న్యాయమూర్తి అన్నారు. ముగ్గురు నిపుణుల ప్యానెల్ ఈ తీర్పునిచ్చింది. జడ్జి జోనాథన్ బ్రెయిన్ నేతృత్వంలోని ప్యానెల్.. ఒకరి బట్టతల గురించి వ్యాఖ్యానించడం అవమానకరమైనదా లేదా వేధింపు అవుతుందా అనే దానిపై చర్చించి దాన్ని వేధింపుగా పరిగణించాలంది.
ఏ ఎలక్ర్టీషియన్, అతను పనిచేస్తున్న సంస్థ మధ్య నడుస్తున్న కేసు అది. టోనీ ఫిన్ గత మేలో సంస్థ బయటకు వచ్చేవరకు వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్రిటిష్ బంగ్ కంపెనీలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేశాడు. అయితే పనిచేసే సమయంలో తన సూపర్ వైజర్ జామీ కింగ్ తనను వేధించేవాడంటూ కంపెనీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాడు. ఆసమయంలో తను చాలా కలత చెందేవాడనని వాపోయాడు. దీంతో విచారణ జరిపిన ట్రిబ్యునల్ బట్టతల గురించి వ్యాఖ్యానించడం లైంగికవేధింపులే అవుతాయంది. రొమ్ముల సైజు గురించి మాట్లాడితే స్త్రీ ఏ విధంగా బాధపడుతుందో.. బట్టతల గురించి మాట్లాడితే మగవాడు అలాగే బాధపడే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ నిర్ణయం వెలువరించింది.