ఉద్ధవ్ థాకరేను చెప్పుతో కొడతానన్నందుకు కేంద్ర మంత్రి నారాయణ రాణె తన ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో థాకరే ఇప్పుడు ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడేళ్ళ క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చెప్పుతో కొట్టాలన్న ఉద్ధవ్ ఠాక్రే మాటల్ని బీజేపీ గుర్తు చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయాలంటున్నారు. .
ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు, యోగిపై ఉద్ధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్రమంత్రి రాణె అరెస్ట్‌తో చర్చల్లోకి వచ్చాయి. 2018లో జరిగిన ఓ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి యోగి ఆదిత్యనాథ్, చెప్పులు వేసుకొని పూలదండ వేయడంపై ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు.. యోగి కదా.. అన్ని పరిత్యజించి ఇల్లు వదిలి పెట్టి వెళ్లి గుహలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అయినా యోగినని చెప్పుకుంటున్నారు. ఈ యోగి గాలి బుడగలాంటి వారు. నాకైతే అదే చెప్పుతో కొట్టాలనుందన్న ఉద్ధవ్ వ్యాఖ్యల వీడియో మళ్లీ తెగ వైరల్ అవుతోంది. ‘శివసేన హిపోక్రసీ’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.