రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో నిన్న సాయంత్రం MIG-21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. వింగ్ కమాండర్ మోహిత్ రాణా (39), ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ బాల్ (26) IAF యుద్ధ విమానం కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
వింగ్ కమాండర్ మోహిత్ రాణా హిమాంచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని సంధోల్కు చెందినవారు. అతని తండ్రి రామ్ ప్రకాష్ ఇండియన్ ఆర్మీలో కల్నల్ పదవి నుంచి పదవీ విరమణ పొందారు. రామ్ ప్రకాష్ చండీగఢ్‌లో నివసిస్తున్నారు. మోహిత్ రాణా అంత్యక్రియలు చండీగఢ్ లో మాత్రమే జరుగుతాయని మండి డిసి అరిందమ్ చౌదరి తెలిపారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది.
“ఐఏఎఫ్ ప్రాణనష్టానికి చింతిస్తోంది.. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించాం” అని భారత వైమానిక దళం తెలిపింది.
https://twitter.com/IAF_MCC/status/1552705784190214144?s=20&t=gEzBSrNQKj9pWuCSwZL1Uw
ప్రమాదం తర్వాత, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా IAF పైలట్ల మృతికి సంతాపం తెలిపారు.
IAF MIG-21 ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో ఇద్దరు వైమానిక యోధులను కోల్పోవడం బాధించిందని… వారు చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిదని రాజ్‌నాథ్ అన్నారు..
https://twitter.com/rajnathsingh/status/1552709650235043846?s=20&t=gEzBSrNQKj9pWuCSwZL1Uw