పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా భారత్లో నిలిచిపోయింది. చట్టబద్దమైన డిమాండ్ కు అనుగుణంగా దాన్ని నిలిపేసినట్టు తెలిసింది. జులైలో కూడా ఓ సారి ఇలాగే పాక్ ప్రభుత్వ ట్విట్టర్ ను ఇక్కడ నిలిపేశారు. తరువాత పునరుద్ధరించారు. ఇప్పుడీ నిలిపివేతతో పాకిస్తాన్ అకౌంట్ భారత్ లో తెరుచుకోదు. ఇటీవల భారత సర్కారు 16 యూట్యూబ్ చానళ్లను నిషేధించగా వాటిలో ఆరు పాకిస్తాన్ వే.