హిందూ వ్యతిరేక అజెండాతో పార్టీ.. భార్య సంగీత సంచలన ఆరోపణలు!
…………………………………………….
తమిళ చిత్రసీమలో ‘దళపతి’గా చలామణి అవుతూ, రాజకీయాల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ద్వారా మార్పు తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్న విజయ్ అసలు స్వరూపం బట్టబయలైంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, విజయ్ వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పిటిషన్లో సంగీత చేసిన ఆరోపణలు విజయ్ నైతికతను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తీవ్రంగా ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
……………………………………………………
విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుండే ఆయనపై క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు సంగీత దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశం మరింత స్పష్టంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. విజయ్ తన సంపాదనలో సింహభాగాన్ని క్రైస్తవ మత సంస్థలకు, ప్రచారానికి విరాళాలుగా ఇస్తున్నారని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మతం ముసుగులో రాజకీయం చేస్తూ, హిందూ ఓటర్లను మోసం చేసేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శకులు మండిపడుతున్నారు.
……………………
27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ సంగీత తీసుకున్న నిర్ణయం విజయ్ బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, తనను మరియు పిల్లలను పట్టించుకోవడం లేదని సంగీత ఆరోపించారు. ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ, మరోవైపు సొంత భార్యకు అన్యాయం చేయడం విజయ్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.
……………………………….
భార్య నుండి ఎదురైన ఈ న్యాయపరమైన సవాలు, మతపరమైన ఆరోపణలు విజయ్… రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 20న స్వయంగా విచారణకు హాజరు కావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది.



