పంజాబ్ లోని ఇండోపాక్ సరిహద్దులో మరోసారి కలకలం రేగింది. ఫిరోజ్ పూర్ జిల్లాలోని ఓ వ్యవసాయక్షేత్రంలో పేలుడుపదార్థాలతో నిండిఉన్న టిఫిన్ బాక్స్ ను పోలీసులు గుర్తించారు. అయితే నాలుగు రోజుల క్రితం జలాలాబాద్ పేలుడు కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయగా టిఫిన్ బాక్స్ బాంబుల గురించి బయటపడింది. ఆ కుట్రలో భాగంగానే ఈ టిఫిన్ బాక్సును ఫిరోజ్ పూర్లో ఉంచినట్టు భావిస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న జలాలాబాద్ పేలుళ్ల కేసులో నిందితుడు రంజిత్ సింగ్ అలియాస్ గోరాకు ఆశ్రయం కల్పించినందుకు ఇద్దరు వ్యక్తుల్ని లూథియానా రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

file photo(INDIA-PAKISTAN Border)