తిరుమలలో అన్యమతస్తుల ఆగడాలు ఎక్కువ అయ్యాయి. కీలక పోస్టులలో తిష్ట వేసుకుని అక్రమాలకు తెగబడుతున్నారు. శ్రీవారి ఆలయం నుంచి జీతాలు తీసుకుంటూ నల్ల అట్ట పుస్తకాలు పంచుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలను టార్గెట్ చేసుకుని.. మత మార్పిడిలకు దిగుతున్నారు.
దీని మీద స్పందించిన టిటిడి అన్యమతస్తులను గుర్తించే పని చేపట్టింది. ముఖ్యంగా విద్యాలయాల్లో కీలక పోస్టుల నుంచి అన్య మతస్తులను తప్పిస్తోంది.
పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేశారు. ఆమె ను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.
ఆమె మీద చాలా ఆరోపణలు ఉన్నాయి.
క్రైస్తవ మత సంప్రదాయాలు పాటించడమే కాకుండా.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకోరు. అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో.. లూప్ లైన్ కు పంపిస్తున్నారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది.
టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. సుమారు 50 మందికి పైగా కీలక అధికారులను గుర్తించారు . వీరిని ఇతర పోస్టింగుల్లోకి పంపిస్తున్నారు. దీంతో అన్య మతస్తుల ఆరోపణలకు చెక్ పడుతుంది అని టిటిడి భావిస్తోంది.
అన్యమతస్తుల బదిలీని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ భక్తుల మనోభావాలకు అనుగుణంగా టీటీడీ ముందుకు అడుగులు వేస్తోంది.