అమెరికా కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంఫ్ కీలక పదవులను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైందవ మూలాలు కలిగిన ముగ్గురుని కోర్ టీమ్ లోకి తీసుకొన్నారు. ఈ ముగ్గురికీ హైందవ దేవీ దేవతలు అంటే భక్తి ప్రపత్తులు అధికం, అంతే గాకుండా అమెరికా అధ్యక్షునికి సన్నిహితంగా ఉంటూ కీలక నిర్ణయాలు తీసుకొనే పదవుల్లోకి ఎంపిక అయ్యారు.
తులసీ గాబ్బర్డ్, హిందూ ఫైర్ బ్రాండ్ అన్న మాట. ఇప్పుడు నేషనల్ సెక్యురిటీ డైరక్టర్ గా బాధ్యతలు తీసుకొంటున్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ, సెక్యురిటీ సంస్థ ఎన్ ఐ ఏ వంటి సంస్థలన్నీ ఆమె గుప్పిట్లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ఆమెకు తెలిసిపోతుంది. ప్రపంచ దేశాల వ్యవహారాల్లో ఆమె సలహాలు, సూచనల ఆధారంగా కొత్త అధ్యక్షుడు ట్రంఫ్ నిర్ణయాలు ఉండవచ్చు. చాలా కాలం యుద్దంలో ప్రత్యక్షంగా పనిచేసిన తులసీ.. హైందవ సాంప్రదాయాలు బాగా ఇష్టపడతారు. యుద్ద సమయాల్లో భగవద్గీత ను నమ్ముకొన్నట్లు చెబుతూ ఉంటారు.
వివేక్ గణపతి రామస్వామి, అచ్చమైన తమిళ యువకుడు. అమెరికా పరిపాలన లోని వివిధ ప్రభుత్వ శాఖల బడ్జెట్ లను నిర్దారించి, కత్తిరింపు వేస్తుంటారు. డీ ఓ జీ ఏ అధిపతి అంటే ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయన కంట్రోల్ లో ఉంటాయి అన్న మాట. రిపబ్లికన్ పార్టీలో కీలకంగా ఎదుగుతూ వచ్చిన వివేక్ రామస్వామి .. అటు ఎలన్ మాస్క్ కు కూడా సన్నిహితుడు. కేరళ లోని పాలక్కాడ్ ప్రాంతం నుంచి అమెరికాకు తరలి వచ్చిన సాంప్రదాయ తమిళ కుటుంబానికి చెందిన వారు. ఇంట్లో శుభ్రంగా తమిళం, మలయాళం మాట్లాడుకొంటారు. క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శించే కుటుంబం.
కశ్యప్ పటేల్, ట్రంఫ్ టీమ్ లోని యువ కెరటం అన్న మాట. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు చిన్న వయస్సులో డైరక్టర్ గా బాధ్యత తీసుకొంటున్నారు. దేశంలోని పెద్ద పెద్ద వ్యవహారాల మీద దర్యాప్తు చేయించే కీలక విభాగం ఇది. డొనాల్డ్ ట్రంఫ్ మీద రష్యా ఏజంట్ అన్న ప్రచారం జరిగినప్పుడు, దానిని ఖండిస్తూ ఆధారాలు సేకరించి, ఆయన్ని రక్షించిన వాడు. అచ్చమైన గుజరాతీ వ్యాపారుల కుటుంబానికి చెందిన పటేల్.. ఇప్పటికీ దేవీ దేవతల ఆరాధనలో ముందు ఉంటారు.
ఈ ముగ్గురితో పాటు జై భట్టాచార్య అనే భారతీయ అమెరికన్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరక్టర్ పదవిని కేటాయిస్తున్నారు. మొత్తం మీద ట్రంఫ్ పరిపాలనలో భారతీయులకు కీలక పాత్ర ఇవ్వటం ద్వారా మైనార్టీలను రిపబ్లిక్ పార్టీ కూడా ఆదరిస్తుంది అన్న భావన ఏర్పడుతోంది. పైగా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగు అవుతాయి అన్న ఆశలు కూడా పెరుగుతున్నాయి.