నిర్మల్ లోని విశ్వనాథ్ పేట్ కు చెందిన స్థానిక 16 సంవత్సరాల హిందూ మైనర్ బాలికపై అక్కడి మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అత్యాచారం చేశారు. నిర్మల్ డీస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, సాజిత్ నిర్మల్ లో స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికై చిన్న వయస్సులోనే మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవిని చేపట్టాడు. ఇటీవల ఆ బాలికను చూసి అన్నపూర్ణమ్మ అనే మహిళా ద్వారా శారీరకంగా లొంగదీసుకోవడానికి యత్నించాడు. అన్నపూర్ణమ్మ సాయంతో బాలికను మాయమాటలతో హైదరాబాద్ వరకు తీసుకొచ్చి అప్పటికే తాను బస చేస్తున్న లాడ్జిలో తనకు అప్పగించేలా ప్లాన్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ప్రశ్నించగా జరిగిన అఘాయిత్యాన్ని తల్లితో చెప్పింది. ఆ తల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాజిత్ పై పోక్సో, ఐపీసీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పార్టీ నుంచి తొలగించే యోచనలో పార్టీ నేతలున్నట్టు సమాచారం.
ఈ అత్యాచారాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడి చేసింది. అధికార
తెరాస మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్, తెరాస నాయకులు బీజేపీ నాయకులపై దాడిచేశారు. ఈ కార్యక్రమానికి అడ్డు పడటమే కాకుండా అధికార పార్టీ చైర్మన్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు కూడా అఘాయిత్యానికి పాల్పడ్డ సాజిత్ కు వంతపాడటం ఆశ్చర్యానికి గురి చేసింది.
మున్సిపల్ కార్యాలయ ముట్టడిలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అరవింద్ సహా తదితరులు పాల్గొన్నారు.