వైసీపీ నేతలంతా గప్ చుప్..
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజకీయాలకు పెట్టింది పేరు. కొంతకాలంగా వైసీపీ మీద వరుసగా విమర్శలు వచ్చి పడుతుండడంతో,, ఉత్తరాంధ్ర ప్రజలు ఫ్యాన్ స్పీడుతో వైసిపిని దూరం పెడుతున్నారు. అటు వైసిపి నాయకులు కూడా ప్రజల్లోకి రాలేక ఇంటిపట్టునే కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో వైసిపి జాడ కనిపించడం లేదు.
మొన్నటి ఎన్నికల్లో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఉత్తరాంధ్ర కు వైసిపి ఇన్చార్జిగా ఉన్న విజయసాయి రెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డి కూడా పెద్దగా విశాఖపట్నం వైపు రావడం లేదు. ఆ ఇద్దరిని కేసులు తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఆ నేతలకు ఫొన్ టచ్ లో ఉంటే తాము కూడా ఇరుక్కొని పోతామని స్థానిక నేతలు భావిస్తున్నారు. దీంతో పార్టీ పని అందుకొనేవారు కనిపించటం లేదు.
సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మాత్రమే నాలుగైదు రోజులకు ఓ సారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అంతకుమించి ఆయన కూడా పెద్ద హడావిడి చేయడం లేదు. తప్పనిసరి అయినప్పుడు పార్టీ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ , ఆయన భార్య, ఆయన తమ్ముళ్లు … అంతా హడావుడి చేసేవారు. ఇప్పుడు అంతా గప్ చుప్.
మిగిలిన వైసీపీ నాయకులు అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఉత్తరాంధ్రలో ఏ నియోజకవర్గంలో చూసినా కూటమి అభ్యర్థులకు యాభై వేలకుపైగా మెజార్టీ వచ్చింది. పవన్, టీడీపీ కలిస్తే ఎలా ఉంటుందో వారికి అర్థమయింది. ప్రతి నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాణ్ సాలిడ్ ఓటు బ్యాంకు ని తెలుగుదేశానికి జత చేసారు. దీంతో కూటమికి ఘనవిజయం లభించింది. విశాఖపట్నంలో రాజధాని పెడతాను అని. వైఎస్ జగన్ ఎఃతచెప్పినా.. వైజాగ్ లో కూడా వైసిపికి పరువు దక్కలేదు.
ఎన్నికల తర్వాత కాలంలో కూడా వైసిపి మీద దాడిని టీడీపీ తీవ్రం చేసింది. ఈ లోగా, దువ్వాడ శ్రీనివాస్ బాగోతం,, తిరుమల లడ్డు వివాదం, ఓడల్లో డ్రగ్స్ తెస్తున్నారు అని ప్రచారం… కలగలిసిపోయి వైసిపికి శాపంగా మారాయి. దీంతో సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే ఉత్తరాంధ్ర ప్రజలు వైసిపి పేరు చెబుతేనే మండిపడుతున్నారు. దీంతో
ఇప్పుడల్లా వైసిపి కి సానుభూతి వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు.
తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీ కి రాజీనామా చేశారు. మరో మాజీ మంత్రి
ధర్మాన ప్రసాదరావు ఏమి మాట్లాడటం లేదు. వైసిపి నేతలంతా సైలెంట్ అయిపోయారు. వారు పార్టీలోనే ఉంటున్నారు..కానీ చడీ చప్పుడూ అయితే లేదు. వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు. వేరే పార్టీలలోకి వెళ్లిపోవడానికి ఉన్న పార్టీ నుంచే రాజకీయం చేసుకుంటున్నారు. పార్టీతో పట్టనట్లుగా ఉంటున్న వారు, బయటకు వెళ్తే స్పష్టత వస్తుంది. కానీ అలా చేయడంలేదు. వైసీపీ నేతలుగా ఉంటూనే రాజకీయ రాయబేరాలు చేసుకుంటు న్నారని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలోని పార్టీ నాయకులకు అధిష్టానం కబుర్లు పంపుతోంది. పార్టీలో ఉంటే పదవులు ఇస్తామని, మళ్లీ చురుకుగా పనిచేయాలని కోరుతోంది. కానీ ఎవరూ స్పందించడంలేదు. మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా చోట్ల సరైన స్పందన లేని లేదు.
ఉత్తరాంధ్రలో ఒకటి రెండు ప్రెస్ మీట్ లు తప్ప వైసీపీ తరఫున ఏమీ జరగడం లేదు. నాయకులు బయటికి రాకపోవడంతో,, పార్టీకి మరింత కష్టం ఏర్పడుతోంది. దీన్ని ఎలా పరిష్కరించాలో అని వైసీపీ అధిష్టానం పరిష్కారం వెతుకుతోంది.