త్రిపురలోని అగర్తలా కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో భాజపా భారీ విజయాలు సాధించింది.
ఖోవై (8 సీట్లు), కుముర్ఘాట్ (15 సీట్లు), అమర్పూర్ (13 సీట్లు), ధర్మనగర్ (24 సీట్లు), తెలియమురా (15 సీట్లు), జిరానియా (11 సీట్లు) సహా 11 పౌర సంస్థలలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. , మేలఘర్ (13 సీట్లు), సోనమురా (13 సీట్లు), బెలోనియా (17 సీట్లు), సబ్రూమ్ (9 సీట్లు) మరియు AMC (51 సీట్లు)ను ఆ పార్టీ గెలుచుకుంది.
అంబాసాలో… తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా , ప్రద్యోత్ కిషోర్ నేతృత్వంలోని త్రిపురా మోతా కేవలం ఒక్కో సీటు చొప్పున దక్కించుకున్నాయి. మిగిలిన 12 స్థానాలను అధికార బీజేపీ గెలుచుకుంది. పాణిసాగర్, కైలాషహర్లలో సీపీఐ (ఎం) ఒక్కో సీటుచొప్పున దక్కించుకుంది. అధికార బీజేపీ 112 స్థానాల్లో పాగావేసింది.
మొత్తం 222 వార్డులకు 785 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బిజెపి మొత్తం 217 స్థానాలను గెలుచుకోగా, సిపిఐ (ఎం) 3 స్థానాలను , టిఎంసి , త్రిపురా మోతా పార్టీలు ఒక్కో సీటును మాత్రమే గెలుచుకున్నాయి. మొత్తం 334 స్థానాలకు గాను బీజేపీ 329 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.