మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పాలకుల బానిస చిహ్నాలను ఒక్కొక్కటిగా వదిలిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ పట్టణాలు నగరాలకు బానిస పేర్లను తొలగించారు. తాజాగా రైల్వే శాఖ తో కలిసి కొన్ని సంస్కరణలు చేపట్టారు.
పూణే డివిజన్ లోని అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ పేరును అహల్యా నగర్ గా మార్చారు. లోకమాతా అహల్యా బాయి హోల్కర్ కి నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గతంలో ఈ స్టేషన్ ను అహ్మద్ నగర్ గా పిలిచేవారు. ఇప్పటి నుంచి అహల్యానగర్ గా పిలుస్తారని రైల్వే శాఖ పేర్కొంది.
అయితే స్టేషన్ కోడ్ లో మాత్రం ఎలాంటి మార్పు వుండదని రైల్వే శాఖ పేర్కొంది. అహల్యా నగర్ రైల్వే స్టేషన్ గా పిలుస్తూ, గతంలో లాగే ANG పేరుతో స్టేషన్ కోడ్ కొనసాగుతుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ, ఫడ్నవీస్ మాత్రం ముందుకే అడుగులు
వేస్తున్నారు.