టాలీవుడ్ లో మరో విషాదం. యువనటుడు సుధీర్ వర్మ వైజాగ్ లోని తనింట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే అతని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ సినిమాలో హీరోగా నటించాడు వర్మ. సెకండ్ హాఫ్, షూట్ అవుట్ ఎట్ ఆలేరు వంటి చిత్రాలోనూ కనిపించాడు. పలు వెబ్ సిరీస్ ల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. సుధీర్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
                                                                    



