సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం – తపస్ డిమాండ్ చేసింది. ఇటువంటి న్యాయపరమైన డిమాండ్లతో తపస్ నాయకులు జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు నిర్వహించారు. ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ దీక్ష లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు తపస్ నాయకులు ఒకరోజు నిరసన చేపట్టారు. పెండింగ్ DA లు వెంటనే చెల్లించాలని, ఈ-కుబేర్ లో ఉన్న పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్పీ ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
న్యాయబద్ధమైన డిమాండ్లతో ఒక వినతి పత్రం రూపొందించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి పంపించాలని జిల్లా కలెక్టరేట్ లో అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపిక్రిష్ణ, జిల్లా నాయకులు బచ్చు నారాయణ, మెస్రం రాజ్ కుమార్, చదల రాజేష్, మెట్పల్లి గోపాల కృష్ణ, జీజబాయి,వీరయ్య,రవి, రాజేశ్వర్, దత్తాత్రి, కేశవ్, గోపాల్, రితేష్ తదితరులు పాల్గొన్నారు.