నేడు సమాజములో ఆధ్యాత్మిక చింతన తగ్గి, వ్యక్తిగత విషయాల పట్ల మక్కువ చూపిస్తున్న సందర్భంలో అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కలిసి హిందూ ధర్మ జాగరణ మండలిని ఏర్పాటు చేసుకొన్నారు . అనేక రకాలైన భక్తి కార్యక్రమాలు చేపడుతున్నారు. సమాజములో ఆధ్యాత్మికను పెంపొందిస్తూ, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలి అనే భావనతో ముందుకు వెళుతున్నారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని స్థానిక శ్రీ రామాలయంలో ప్రతిష్టించి మొదటి కార్యక్రమన్ని ప్రారబించారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం ఈ మట్టి వినాయకుడు.
పర్యావరణహితంగా వినాయకుడిని మట్టితో ఏర్పాటు చేసి ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
వినాయక నిమజ్జనాన్ని సైతం సాంప్రదాయబద్ధంగా అంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహిస్తున్నారు . భక్తి పాటలతో జై వినాయక నినాదాలతో హిందూ ధర్మజాగరణమండలి సభ్యులంతా కలిసి వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న మహిళలంతా విచ్చేసి దీపాలు వెలిగించి తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు.
ఈ సందర్భంగా దామోదర తులసి కళ్యాణాన్ని నిర్వర్తిస్తున్నారు.
ఇందులో మహిళలు సాంప్రదాయ దుస్తులతో పూజలు నిర్వహిస్తూ రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ముందుకు వెళుతున్నారు.
హిందూ ధర్మ జాగరణ మండలి సభ్యులు ఒకే కుటుంబంగా భావిస్తూ తరతరాల నుండి వస్తున్న భారతీయ సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తప్పకుండా పాటిస్తూన్నారు. పిల్లలకు కూడా అదే విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ముందుకు సాగుతున్నారు.
హిందూ ధర్మ జాగరణ మండలి హనుమాన్ చాలీసా పారాయణంతో గ్రామంలో ఆధ్యాత్మికమైన వాతావరణన్ని నెలకొల్పుతున్నారు.
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారి ఆశీస్సులతో ప్రారంభమైనది. దీని ద్వారా మానసిక ఉల్లాసం, ఏకాగ్రత, భక్తి భావాలు ఆధ్యాత్మికత పెంపొందుతున్నాయని సభ్యులు పేర్కొంటున్నారు.
హిందూ ధర్మ జాగరణ మండలి వారు చేపట్టిన హనుమాన్ చాలీసా పారాయణం నేటికీ 37 వారాలు పూర్తిచేసుకున్నది.
హిందూ ధర్మ జాగరణ మండలి చేస్తున్న పనులను చూసి గ్రామ పెద్దలు,ప్రజలు అభినందిస్తున్నారు. నేటి తరం యువతకు ఇది ఆదర్శనీయం అని చెబుతున్నారు.