దేశానికి ఆర్థిక మంత్రిగా తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ ఇక లేరు. దేశం కష్టాల ఊబిలో ఇరుక్కొని ఉన్నప్పుడు, బయటకు తీసి పట్టాలు ఎక్కించిన ఘనత ఆయనది. తర్వాత పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా దేశంలో చెరగని ముద్ర వేశారు. ఆయన జీవితంలోని టాప్ టెన్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
1) ప్రస్తుత పాకిస్థాన్లోని గాహ్ ప్రాంతంలో జన్మించిన మన్మోహన్ సింగ్… పంజాబ్ యూనివర్సిటీ , కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ .లలో చదువుకొన్నారు. తర్వాత భారత్కు తిరిగొచ్చి పంజాబ్ యూనివర్సిటీలో. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లోనూ ప్రొఫెసర్గా పాఠాలు బోధించారు.
2) అదే సమయంలో వాణిజ్య, పరిశ్రమల శాఖకు సలహాదారుగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అప్పట్లో పరిశ్రమలన్నీ జాతీయీకరణ జరగాలని పట్టుబట్టిన శాస్త్రవేత్తలలో ఆయన కూడా ఒకరు.
3) 1982 నుంచి లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. 1985 నుంచి 1987 వరకు ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్గా పనిచేసి, రాష్ట్రాలకు నిధుల కొరత లేకుండా చూసుకొన్నారు. ఎకానమీ ని సరళీకృతం చేస్తూ వచ్చారు.
4) 1991లో దేశం కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహారావు.. మన్మోహన్ సింగ్కు ఆర్థికమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గాడిన పెట్టే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ సమయంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలకు, సరళతర విధానాలకు మన్మోహన్ సింగ్ శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారు.
5) భారత దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారు. దీంతో పారిశ్రామికీకరణ జరిగి, పెద్ద ఎత్తున కంపెనీలు ధేశంలోకి అడుగు పెట్టాయి. మన విద్యార్థులకు చదువుకొనే అవకాశాలు పెరిగి, వేలాదిగా ఉద్యోగావకాశాలు లభించాయి. అంతిమంగా దేశంలో సంపద సృష్టి జరిగి, సమాజం బాగు పడింది.
6) 1991లో మొదటిసారి అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్ 2019 వరకు కొనసాగారు. బీజేపీ ప్రభుత్వ హయంలో రాజ్యసభ లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అప్పట్లో ఆర్తిక సంస్కరణల విషయంలో కేంద్రానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు చేశారు.
7) 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవికి అనేక మంది పేర్లు వినిపించినా అనూహ్యంగా ఈ అవకాశం మన్మోహన్ సింగ్కు దక్కింది. పదేండ్ల పాటు ప్రధానిగా కొనసాగి, దేశానికి ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన నేతల్లో ఒకరుగా నిలిచారు.
8) ప్రధానిగా పని చేసినప్పుడు ఆయన దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు సామాన్యులకు ఉండాలనే లక్ష్యంతో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారు. గ్రామీణ ప్రజలకు వ్యవసాయేతర ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చారిత్రక ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు.
9) ఈ దేశంలో సర్పంచ్ లు, వార్డు మెంబర్లే పదవి అడ్డుపెట్టుకొని లక్షలు సంపాదించే పరిస్తితి. కానీ, దేశ ప్రధానమంత్రి గా ఉన్నప్పటికీ, ఆయన ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు. కాంగ్రెస్ హయంలో అడ్డగోలుగా తినేసే మంత్రుల మధ్య ఉంటూ కూడా… నిజాయతీ గా వ్యవహరించారు.
10) ప్రధానమంత్రి పదవి పూర్తి అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. చిల్లర రాజకీయాలకు పాల్పడకుండా హుందాగా వ్యవహరిస్తూ వచ్చారు. రాజ్యసభలో కూడా నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ వచ్చారు.
………
అనారోగ్యంతో చాలా కాలంగా ఇంటికే మన్మోహన్ పరిమితం అయిపోయారు. చివరకు డిసెంబర్ నెల 26వ తేదీన ఆయన కన్నుమూశారు.