బీహార్ లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉమ్మడి ప్రయత్నం చక్కటి ఫలితాలను ఇచ్చింది. మధ్య లో కొంత సమయం తప్పిస్తే,, సుమారు పాతికేళ్లుగా బీహార్ కు నితీశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ విజయానికి దారి తీసిన టాప్ టెన్ ఫలితాలను విశ్లేషిద్దాం.
……………………………….
1. డబుల్ ఇంజన్ సర్కార్
బీహార్లో NDAకు ఉన్న పెద్ద బలమే నాయకత్వం. ముఖ్యంగా నరేంద్రమోదీ.. నితీశ్ కుమార్ పరిపాలన ప్రజల్లో నమ్మకం కలిగించింది. “అనుభవం ఉన్న ప్రభుత్వం వస్తే నే మంచిదని” ఓటర్లు భావించారు.
2. మహిళా ఓటర్ల మద్దతు
ఈసారి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో NDAకి మద్దతు ఇచ్చారు. ప్రతీ ఇంటికీ అందుతున్న సంక్షేమ పథకాలతో మహిళలంతా ఎన్డీయే కూటమికి జై కొట్టారు.
3. వర్గ సమీకరణాలు
బీహార్ రాజకీయాల్లో ఎప్పుడూ వర్గ సమీకరణలు కీలకం. వివిధ కులాలు, వర్గాల మద్దతు సంపాదించడంలో ఎన్డీయే ముందంజ వేసింది. సమన్వయంతో పనిచేయడం వల్ల ఎక్కువ సీట్లలో వారికి ప్రయోజనం కలిగింది.
4. అవినీతి ఆరోపణలు
ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తి స్థాయి అవినీతి పార్టీలుగా ముద్ర పడ్డాయి. అవినీతి నాయకులను ప్రజలు, ముఖ్యంగా యువత చీదరించుకొంటున్నారు.
5. అభివృద్ధి భావన
రహదారులు, విద్య, ఆసుపత్రులు, హౌసింగ్ వంటి అంశాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారు. “కనిపించే అభివృద్ధి” అనే భావన నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద వరం అయింది.
6. ప్రత్యర్థుల అసమన్వయం
మహాగఠబంధన్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం లోపించింది. ఆశించిన స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం NDAకి లాభం చేకూర్చింది.
7. రాహుల్ గాంధీ గడబిడ
ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేసిన గడబిడ పూర్తిగా బెడిసి కొట్టింది. ఓటు చోరీ జరిగిందంటూ అర్థం లేని ఆరోపణలు చేసి నవ్వుల పాలు అయ్యారు.
8. కాంగ్రెస్ కు అసమ్మతి సెగ
రాహుల్ గాంధీ ప్రవర్తన చూసి కాంగ్రెస్ నేతలే విసిగిపోయారు. అటు ఆర్జేడీ లోనూ లాలూ ప్రసాద్ రాజకీయాలతో యువ నాయకత్వం విసిగిపోయింది. దీంతో రెండు పార్టీలకు అసమ్మతి సెగ బాగా తగిలింది.
9. కాంగ్రెస్ కు బ్రేక్
బీహార్ లో కాంగ్రెస్ కు బ్రేక్ వేయాలని ప్రజలు భావించారు. రాబోయే కాలంలో బెంగాల్, యూపీ వంటి పెద్ద రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సెంటిమెంట్ ను బీహార్ రాజేసింది.
10. రాజకీయ స్థిరత్వంపై ఆకాంక్ష
బీహార్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో స్థిరత్వం అవసరం ఉందని ప్రజలు భావించారు. ఈ స్థిరత్వాన్ని అందించగల కూటమిగా మోదీ నితీశ్ టీమ్ ను ప్రజలు భావించారు.
…………………………………………………
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి దేశ వ్యాప్తంగా ఉన్న ఆదరణ ను నితీశ్ కుమార్ గమనించారు. అందుచేతనే మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి లో చేరి లబ్ది పొందారు. దీని ద్వారా రెండు పక్షాలకు మేలు కలిగింది. మొత్తం మీద బీహార్ కు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న నాయకునిగా నితీశ్ కుమార్ కు ఖ్యాతి దక్కుతోంది.




