సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ యూసుఫ్ గూడాలోని తనింట్లోనే తుదిశ్వాస విడిచారు. 300 కు పైగా సినిమాల్లో నటించారు బాలయ్య. నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అమృత ఫిల్మ్స్ బ్యానర్ పై చెల్లెలికాపురం, నేరము-శిక్ష, ఊరికిచ్చినమాట వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు బాలయ్య. పసుపుతాడు, పోలీస్ అల్లుడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా పలు చిత్రాల్లో హీరోగా నటించారు.