భారత్ లో తొలిసారిగా నిర్వహించిన చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఒలింపియాడ్ లో ఓపెన్&మహిళల విభాగాల్లో రికార్డు స్థాయిలో జట్లు పాల్గొన్నాయి. ముగింపు కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు. 44వ అంతర్జాతీయ చదరంగ పోటీలు నిర్వహించే అవకాశం మొట్టమొదటిసారిగా భారత్కు దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు చెంగల్పట్టు జిల్లాలోని మహాబలిపురాన్ని ఎంపిక చేసి పోటీల నిమిత్తం వెంటనే 100 కోట్లను కూడా మంజూరు చేశారు. 186 దేశాలకు చెందిన 2 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలను ప్రపంచదేశాల ప్రశంసలు పొందేలా విజయవంతంగా నిర్వహించారు. 12 రోజులు అత్యంత ఉత్సాహభరితంగా సాగిన చెస్ ఒలంపియాడ్ ముగింపు కూడా ప్రారంభోత్సవ వేడుక లాగే ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించనుంది. FIDE ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్.. ఇటీవల ఎన్నికైన డిప్యూటీ ప్రెసిడెంట్, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ వేడుకకు హాజరుకానున్నారు. ధోని స్టార్ ఎట్రాక్షన్గా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో, విదేశీ చెస్ క్రీడాకారులు, ప్రముఖులను ఘనంగా ఆహ్వానించేలా మహాబలిపురం నుంచి నెహ్రూ ఇండోర్ స్టేడియం వరకు దారిపొడవునా బ్యానర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ఒలింపియాడ్ ను ఆగస్టు 28న నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.