ఈ రోజు ఇద్దరు స్వతంత్ర సంగ్రామంలో అవిరళ కృషి
చేసిన ప్రఖర దేశభక్తుల జన్మదినం
లోక మాన్య బాల గంగాధర తిలక్ 23జూలై 1856 లో
జన్మించారు.. “స్వరాజ్యమే నా జన్మ హక్కు” అని నినాదించారు..
వారు ప్రముఖ హిందుత్వ జాతీయ వాది హిందూ ధర్మ
సంస్కృతుల సంరక్షణ చేయటం ద్వారానే జన సామాన్యంలో
జాతీయతను మేల్కొల్పాలి హిందూ సమాజ సంఘటన
ద్వారానే స్వాతంత్ర్యం సాధించాలి అని నమ్మిన వ్యక్తి ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ హిందువులే ఈ
దేశం హిందువులదే గనక వారు సామాన్య జనంలో దేశభక్తి
జాతీయత జాగృతం చేయటావికి “గణేశ ఉత్సవాలను”
ఉపయెాగించుకున్నారు. అంత వరకు నాలుగు గోడల
మద్యన వ్యక్తి గతంగా కుటుంబ పరంగా జరుపుకునే “గణేశపూజలను” నాలుగు కూడలిల వద్ద బహిరంగంగా
సామాజికంగా గణేశ నవ రాత్రులు జరుపుకుని సామూహి
కంగా నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని ప్రారంభించారు.
అదే స్ఫూర్తితో మహా రాష్ట్ర ప్రాంతంలో ఈ ఉత్సవాలను
సామూహికంగా ఘనంగా జరుపుకుంటారు పూణే
ముంబయి గణేశ ఉత్సవాలకు పెట్టింది పేరు మన భాగ్య
నగర్ లో కూడా అదే స్ఫూర్తితో “భాగ్యనగర్ గణేశ ఉత్సవ
సమితి” ఆధ్వరియంలో ప్రపంచ ప్రసిధ్ధ ఉత్సవాలు జరుగు
తాయనే విషయం మనందరికీ తెలుసు.
బాల గంగాధర తిలక్ గారిని ఒక విలేకరి ఒక ప్రశ్న
వేసారు “స్వతంత్రం లభిస్తే ప్రభుత్వంలో ఏ పోర్టుపోలియో
ఏ మినిస్ట్రీ తీసుకుంటారు” అని అడిగితే తిలక్ చెప్పిన
సమాధానం ” దేశానికి స్వతంత్రం వస్తే నేను ప్రభుత్వంలో
చేరను నేను మా జిల్లా రత్నగిరికి వెల్లి ఇంతకు ముందు
పని చేసిన పాఠశాలలో ఉపాధ్యాయునిగచేరతాను” ఎందుకంటే
“జాతియెుక్క నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుంది”
ఇదీ లోకమాన్య బాలా గంగాధర తిలక్ గారి గొప్పతనం..
“చంద్రశేఖర్ ఆజాద్” 23 జూలై 1906 లో జన్మించారు
స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసిన వారిలో అతివాదులు
మితవాదులు అని రెండు రకాలుగా వుండేవారు
అతివాద దేశభక్తులో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లు
వీరి పేరు వింటేనే త్యాగం సమర్పణ భావం తెగింపు ధైర్యం
ఒక సమున్నత లక్ష్యం కోసం తమ జీవితాలను తృణ
ప్రాయంగా భావించి భారతమాత పాదాల చెంత తమ
ప్రాణ కుసుమాలను అర్పణచేసిన ఆ ఘటనలు వింటే మన
శరీరాల పై వెంట్రుకలు నిక్క పొడుసుకుంటాయి
“నూనుగు మీసాల నూత్న యవ్వనంలో ఉరి తాళ్ళనే
పూల మాలలుగ తుపాకీ గుండ్లనే పూల చెండ్లుగా”
భావించి వీరు చేసిన త్యాగం యువతకెంతో స్ఫూర్తిదాయకం
నీ తల్లి ఎవరు? స్వేఛ్ఛ! నీ తండ్రి ఎవరు? స్వతంత్రం !
అసలు నీ పేరేమిటయా బాబూ? అంటే “ఆజాద్” అని
సింహంలా గర్జించి బ్రిటిష్ వారికి సమాధానం చెప్పిన మన
“చంద్ర శేఖర్ తివారీ (ఆజాద్)” జన్మదినం మనకెంతో స్ఫూర్తి
ప్రేరకం..